SSMB29: మహేష్ తో సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే.. రాజమౌళి పెద్ద షాక్ ఇచ్చాడుగా!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త కాంబినేషన్స్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నయి. ఇక దాదాపు అందరూ మర్చిపోయారు అనుకుంటున్న బిగ్గెస్ట్ మల్టిస్టారర్ సినిమాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇటీవల దర్శకుడు రాజమౌళి RRR సినిమాతో అసలైన మల్టీస్టారర్ మాజాను చూపించాడు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళి నుంచి తర్వాత రాబోయే సినిమా కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. రాజమౌళి కూడా ఆ విషయంపై ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా మహేష్ అభిమానులకు దర్శకుడు మరొక షాక్ ఇచ్చాడు. సినిమా రావడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది అని అర్థం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సరైన టైమ్ సెట్టయ్యింది
దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయాలని గత పదేళ్ల నుంచి అనుకుంటున్నాడు. కానీ ఇద్దరికీ సరైన కథ సెట్ అవ్వడం లేదు. అంతే కాకుండా ఇద్దరికీ ఒకేసారి సరైన సమయం కూడా సెట్ అవ్వడం లేదు. ఇక ఇప్పుడు RRR సినిమా అనంతరం రాజమౌళికి సరైన సమయం దొరికింది. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు.

ఫ్యామిలీ తో హాలిడే ట్రిప్
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన RRR సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను అందుకునే అవకాశం ఉంటుంది. ఇక మొత్తానికి సినిమా సక్సెస్ అయింది కాబట్టి రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజుల వరకు హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లనున్నాడు.

ఫైనల్ స్క్రిప్ట్ రేడి కాలేదు
ఇక బ్రేక్ తీసుకున్న అనంతరం దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టనున్నారు. ఇప్పటివరకు అయితే పూర్తి కథ సిద్ధమవ్వలేదు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో సినిమా ఉంటుంది అని ఇంతకుముందు రచయిత కే విజయేంద్ర ప్రసాద్ ఒక వివరణ ఇచ్చాడు. కానీ రాజమౌళి మాత్రం ఇంకా తాను ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోలేదని చెప్పాడు.

ఈ ఏడాది చివరలో..
ఇటీవల రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా పై స్పందిస్తూ సాధారణంగా ఏదైనా కథను మొదలు పెట్టాలి అంటే పూర్తి స్క్రిప్టు రెడీ చేసుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కొంత సమయం పట్టవచ్చు అని కూడా రాజమౌళి వివరణ ఇచ్చాడు. ఫైనల్ గా ఈ ఏడాది చివర్లోనే సినిమా స్టార్ట్ అవుతుంది అని రాజమౌళి చెప్పినట్లుగా తెలుస్తోంది.
Recommended Video


సినిమా వచ్చేది ఎప్పుడో?
ఇక రాజమౌళి క్లారిటీ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టవచ్చని ఇక తర్వాత సినిమా 2024 లో రావచ్చు లేదా ఆ తరువాత కూడా రావచ్చు అనే సోషల్ మీడియాలో అనేక రకాలుగా కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. RRR అంటే కరోనా కారణంగా ఆలస్యమైంది. కానీ మహేష్ బాబు సినిమా ను మాత్రం ఒకే ఏడాదిలో పూర్తి చేయాలి అని జక్కన్న టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. మరి ఆయన చెప్పినట్లుగా ఈసారైనా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











