RRR మూవీలో రొమాన్స్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. హీరోల మధ్యలోనే అంటూ..
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న మెగా నందమూరి అభిమానుల ఓపికకు రేపటితో ముగింపు కార్డు పడనుంది. ఇక ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి? అవి ఎంత ఆసక్తికరంగా ఉంటాయి? అనే విషయంలో కూడా దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇస్తున్నాడు. అయితే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఏమైనా ఉంటాయా అనే ప్రశ్నలకు కూడా రాజమౌళి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

షూటింగ్ ఎన్ని రోజులు చేశారంటే..
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాలని అనుకుంటాడు. సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి ఆయన ఎంత సమయం అయినా సరే తీసుకుంటాడు. త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ దాదాపు 300 రోజులకు పైగా జరిగినట్లుగా వివరణ ఇచ్చారు. ఇక అంతకుముందు వర్క్ షాప్ ప్రీ ప్రొడక్షన్ కోసం మరో 150 రోజులు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందని అన్నారు.
అర్జున్ రెడ్డి దర్శకుడితో ఇంటర్వ్యూ
రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సందర్భంగా తో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల పై కూడా రాజమౌళి స్పందించడం జరిగింది ఈ సినిమా షూటింగ్ విశేషాలను.. అలాగే elanti హార్డ్ వర్క్ చేశారు అనే విషయంలో కూడా వివరణ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి స్పందన లభిస్తోంది.

కథలోకి వెళ్లిన తరువాత
ఇక సినిమాలో ప్రధానాంశం ఎమోషన్స్ హీరోల కంటే చాలా బలంగా ఉంటాయని చెప్పారు. సినిమా వెండితెరపై మొదలైన తర్వాత మెగా నందమూరి అభిమానులు ఒక పదిహేను నిమిషాల తరువాత వారి అభిమాన హీరోలను మర్చిపోతారు అని ఆ తర్వాత భీమ్ అలాగే రామ్ పాత్రలతో కలిసి కథ లోకి వెళ్ళిపోతారు అని తెలియజేశారు. ఎవరు కూడా హీరోల టైమింగ్ గురించి పెద్దగా పట్టించుకోరు చెప్పుకొచ్చారు.

లవ్ సీన్స్..
ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఇంగ్లీష్ బ్యూటీ ఒలివియా మోరీస్ ను సెలెక్ట్ చేసుకోక రామ్ చరణ్ కు జోడీగా ఆలియాభట్ ను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో లవ్ రొమాంటిక్ సన్నివేశాలు ఏమైనా ఉంటాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తడం విశేషం. ఇక రామ్ చరణ్ మాత్రం సినిమాలో రామ్ చరణ్ అలియా మధ్యలో కొన్ని ప్రేమ సన్నివేశాలు చాలా బాగుంటాయి అని చెప్పారు.

బ్రోమాన్స్ మాత్రమే..
సినిమా లో రొమాన్స్ ఏమి ఉండదు అనే కేవలం బ్రోమాన్స్ మాత్రమే ఉంటుంది అని రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఒక బ్రదర్ ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి అని వివరణ ఇచ్చారు. సినిమాలో బలమైన విలన్స్ వారే అలాగే పవర్ఫుల్ హీరోలు కూడా వల్లే.. అన్ని రకాల ఎమోషన్స్ కూడా వారి మధ్య లోనే కొనసాగుతాయని ప్రేక్షకులు కూడా అలానే ఎక్కువగా కనెక్ట్ అవుతారని రాజమౌళి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











