SS Rajamouli on ANR: ఓకే గదిలో ఏఎన్ఆర్, రాజమౌళి... ఆరోజున ఏం జరిగిందంటే?

అక్కినేని నాగేశ్వర రావు...తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువలేని నటుడు. ఆయన ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ఉత్సవాలను అక్కినేని కుటుంబం నిర్వహించింది. ఈ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏయన్నార్ పంచలోహ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకధీరుడు రాజమౌళి ఏఎన్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే....

ఏయన్నార్ గురించి ఇప్పటి కాలం వారిని అడిగిన చెప్పేస్తారు. అంతటి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించి... తెలుగు కళామాతల్లికి అందించారు. ఈ రోజు ఏయన్నార్ జయంతి. అంతే కాదు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సంవత్సరం కూడా ప్రారంభం అవుతోంది. ఈ క్రమంలోనే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ఉత్సవాలను జరిపింది. ఈ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏయన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

 SS Rajamouli Speech in ANR Statue inauguration ceremony

ఇక ఏఎన్​ఆర్ శతజయంతి వేడుకలకు సీని ప్రముఖులు హాజరయ్యారు. అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, నమ్రత, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు పాల్గొన్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి ఏయన్నార్ గురించి మాట్లాడురు. ఆయన మాట్లాడుతూ... అప్పటి విశేషాలు గుర్తుచేసుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ.... నాగేశ్వరరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆయనను ఆరాధించా. వ్యక్తిగతంగా ఆయనతో నాకు పరిచయం తక్కువ. ఓ అవార్డు వేడుకకు వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే రూములో ఉన్నాం. అప్పుడు 'దేవదాసు' తర్వాత 'మిస్సమ్మ'లో కమెడియన్ రోల్ ఎందుకు చేశారని అడిగానని చెప్పుకు వచ్చారు.

Director SS Rajamouli Comments on Akkineni Nageswara Rao

అప్పుడు ఆయన నాకు దేవదాసు తర్వాత అన్నీ తాగుబోతు కథలు వస్తున్నాయి. అందుకని నేను అడిగి మరీ మిస్సమ్మ చేశానని చెప్పారన్నారు. చక్రపాణి గారు, వాళ్ళు అభిమానులు కొడతారని చెప్పినా సరే... పట్టుబట్టి చేశారట. ఇమేజ్ మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పారట. ఆయన మీద ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ కి చేతులు ఎత్తి నమస్కరించాలి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఎన్నో కథలు విన్నానని తెలిపారు.

ఇక ఈ వేడుకల్లో మహేశ్ బాబు, నమ్రత దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కినేని కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలువురు సినీ ప్రముఖులు అక్కినేని గొప్పతనం గురించి వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X