Just In
- 4 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 29 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 11 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
Don't Miss!
- News
అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మిలియనీర్ల జాబితాలో ఎస్ఎస్ రాజమౌళి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి మిలియనీర్ల జాబితాలో చేరియారు. ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 1 మిలియన్ దాటింది. సౌతిండియాలో ఇంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న దర్శకుడు రాజమౌళి మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘బాహుబలి' చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి విరామం లేకుండా చేస్తున్న చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. రెండు పాటల చిత్రీకరణ, పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ట్రైలర్ ని ఫిబ్రవరి 2015 మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వంద సెకండ్ల ట్రైలర్ ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎడిటర్స్ ... ట్రైలర్ ని తీర్చిదిద్దుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
ప్రభాస్, అనుష్క , తమన్నా, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణతో పాటు తదితరులు మఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పుస్తకంలో చిత్రం మేకింగ్ గురించి ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిత్రం కోసం వేసిన స్కెచ్ లు, షూటింగ్ విశేషాలతో ఈ పుస్తకం సిద్దం చేస్తున్నట్లు వినికిడి. సినీ లవర్స్ కు ఈ పుస్తకం మంచి గిప్టే మరి.

ఇక పోస్టు ప్రొడక్షన్ పనుల్లో అతి ముఖ్యమైన ‘విఎఫ్ఎక్స్' పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విభాగంలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్సన్ శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇండియా, హాంకాంగ్, యూనైటెడ్ స్టేట్స్ లోని వివిధ స్టూడియోల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్, ఆడియో వేడుక, ట్రైలర్స్ ఎప్పుడు అనే విషయం త్వరలో టీం బాహుబలి వారు వెల్లడించనున్నారు.
డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగుతో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఇందుకు సంబంధించిన పనులు ఫిబ్రవరిలో మొదలు కానున్నాయి. ప్రముఖ సౌండ్ ఇజనీర్ పి.ఎం.సతీష్ సౌండ్ డిజైన్ మీద, డెబాజిత్ చాంగ్‌మై సౌండ్ మిక్సింగ్ మీద పని చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోరు, సంగీతం అద్భుతంగా రావడానికి ఎంఎం కీరవాణి రాత్రి పగలనక కృష్టిచేస్తున్నారు.

ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేటన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.