twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేర్ వీడియో వైరల్: రాజమౌళి చెప్పిన కఠిన నిజాలు, మీరు ఏకీభవిస్తారా?

    |

    ఎస్ఎస్ రాజమౌళి కేవలం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు... మంచి వ్యక్తిత్వం ఉన్న హ్యూమన్ బీయింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. అందుకే పలు కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు రాజమౌళితో ఇన్స్‌స్పిరేషనల్ స్పీచ్ ఇప్పించేందుకు ఆసక్తి చూపుతుంటాయి. తాజాగా రాజమౌళికి చెందిన ఓ రేర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇందులో రాజమౌళి సినిమా గురించి, సమాజంలోని కొన్ని అంశాల గురించి ఆసక్తికరంగా స్పందించారు. ఆయన చెప్పిన దాంట్లో కొన్ని కఠిన వాస్తవాలు సైతం ఉన్నాయి. మరి ఆయన చెప్పిన అంశాలతో మీరు ఏ మేరకు ఏకీభవిస్తారు? ఓ లుక్కేయండి మరి....

     నైతిక విలువలు ఉన్న సినిమాలు తీయండి అంటూ ప్రశ్న...

    నైతిక విలువలు ఉన్న సినిమాలు తీయండి అంటూ ప్రశ్న...

    రాజమౌళి గారు మీరు చాలా మంచి సినిమాలు తీశారు. ‘గులేబకావళి కథ' లాంటి మంచి సినిమాలు ఇపుడు రావడం లేదు. మీరు తీసే సినిమాలు బిజినెస్ పరంగా వెరీ సక్సెస్. కానీ నైతిక విలువలు పరంగా ప్రజలను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే సినిమాలు కూడా తీయాల్సిన అవసరం ఉంది.. అని ఒక వ్యక్తి రాజమౌళిని ప్రశ్నించారు.

    జనాలను రౌడీలుగా మార్చేయలేదు: దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన రాజమౌళి

    జనాలను రౌడీలుగా మార్చేయలేదు: దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన రాజమౌళి

    సినిమాలు ప్రజలను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయని నమ్ముతాను కానీ... సినిమాలు జనాలను మార్చేస్తాయి, వారి మెంటాల్టీలో మార్పుతెస్తాయని నేను పర్సనల్‌గా నమ్మను. శివ మూవీ రిలీజైనపుడు ఆ సినిమా మోస్ట్ వయొలెంట్ సినిమాగా ప్రచారం జరిగింది. అది ఎంత వరకు ఇన్ ఫ్లూయెన్స్ చేసిందంటే స్టూడెంట్ బెల్టులకు చైన్లు పెట్టుకుని తిరేగే వరకు ఇన్ ఫ్లూయెన్స్ చేసింది కానీ జనాలను రౌడీలుగా మార్చేయలేదు. గాంధీ సినిమా వచ్చినపుడు ఎవరూ గాంధేయవాదులుగా మారిపోలేదు. అఫ్ కోర్స్ సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుంది కానీ... అందులో ఉండే వయొలెన్స్ మూలంగా జనాల్లో చెడు జరుగుతుంది అని నమ్మను.... అని రాజమౌళి అన్నారు.

    వాళ్లు చెత్తగా తీశారు, అందుకే డైరెక్టర్ అయ్యా.... ఆ హీరోల గురించి అడిగితే క్లాస్ పీకిన రాజమౌళి! వాళ్లు చెత్తగా తీశారు, అందుకే డైరెక్టర్ అయ్యా.... ఆ హీరోల గురించి అడిగితే క్లాస్ పీకిన రాజమౌళి!

    హీరో గురించి ఆలోచించను

    హీరో గురించి ఆలోచించను

    ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా స్పెషల్ ఎఫెక్ట్ష్ బావుంటే, మేకింగ్ స్టాండర్ట్స్ బావుంటే హాలీవుడ్ సినిమాలా ఉందని చెప్పడం మామూలు అయిపోయింది. కానీ మనం కొన్ని షాట్స్, కొన్ని సీన్స్ తీయగలుగుతున్నామే తప్పితే... హాలీవుడ్ స్టాండర్ట్స్ దగ్గరలో లేము. ఒక వేళ తీయాలి, తీసే అవకాశం ఉంది అంటే హీరో గురించి ఆలోచించను, సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాను అని రాజమౌళి తెలిపారు.

    హాలీవుడ్లో మన మైథాలజీ చూపిస్తా

    హాలీవుడ్లో మన మైథాలజీ చూపిస్తా

    ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్' మూవీ వచ్చినపుడు అది అమెరిక అంతటా పెద్ద విజయం అందుకుంది. కానీ దాన్ని ఇంగ్లీష్‌లోకి డబ్ చేయకుండా టైటిల్స్ వేసి చైనీస్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేశారు. నాకు ఛాన్స్ వస్తే ఇండియన్ మైథాలజీస్ తీస్తాను. రామాయణం, మహాభారతం లాంటి పౌరాణికాలను మన కైడ్ ఆఫ్ ఎమోషన్స్ తో హాలీవుడ్లో తీయడానికి ప్రయత్నిస్తాను అన్నారు జక్కన్న.

    డాక్టర్లను బ్యాడ్‌గా చూపడంపై రాజమౌళికి ప్రశ్న

    డాక్టర్లను బ్యాడ్‌గా చూపడంపై రాజమౌళికి ప్రశ్న

    మిమ్మల్ని నిలదీస్తాను అనుకోవద్దు. మీరు ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో గవర్నమెంట్ డాక్టర్లు సరిగా పని చేయరు, స్నేక్ బైట్ కేసు వచ్చినా సరిగా ట్రీట్ చేయరు అన్నారు. కానీ గవర్నమెంట్ డాక్టర్లు కూడా చాలా కష్టపడి పని చేసే వారు ఉన్నారు. మీరు ఆ యాంగిల్ లో ఎప్పుడూ చూడట్లేదు, మీ సినిమాల్లో కూడా చూపించడం లేదు. పెద్ద హీరోలు సినిమాల్లో కూడా అలానే చూపిస్తున్నారు. చాలా మంది డాక్టర్లు కష్టపడి పని చేస్తున్నారు. మీరు పాజిటివ్ గా చూపిస్తే బావుంటుంది.... అని ఒక వ్యక్తి ప్రశ్నించారు.

    రాజమౌళి షాకింగ్ ఆన్సర్

    రాజమౌళి షాకింగ్ ఆన్సర్

    మీరు ఆ కార్యక్రమం మొత్తం చూశారో లేదో తెలియదు. సింహా సినిమాలో డాక్టర్లను హీరోగా చూపించాం. ఆ చర్చా కార్యక్రమంలో డాక్టర్లలో ఉన్న నెగెటివ్ యాంగిల్ చూపించామంటే... దాని అర్థం డాక్టర్లు అందరూ బ్యాడ్ అని కాదు. కానీ దురదృష్టవశాత్తూ... మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ బ్యాడ్. ఇది విచారకరమైన నిజం. నెక్ట్స్ జనరేషన్ వారు అయినా ఈ పరిస్థితి మారుస్తారని నమ్ముతున్నాను... అని రాజమౌళి అన్నారు.

    English summary
    Director SS Rajamouli Gives shocking Answer To A Student Question. Koduri Srisaila Sri Rajamouli, known professionally as S. S. Rajamouli and also by the name "Jakkanna", is an Indian film director and screenwriter, known for his works primarily in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X