RRR ఇండియాలోనే తొలిసారి... హైటెక్నాలజీతో.. రాజమౌళి మళ్లీ మొదలుపెట్టారు.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
బాహుబలి సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా RRR. నవంబర్ 18న సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా డిసెంబర్ చివరి వారంలో తొలి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ముగించింది. తాజాగా జనవరి 21న రెండో షెడ్యూల్‌ను రాజమౌళి ప్రారంభించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

కుమారుడి వివాహం.. సంక్రాంతి పండుగ
RRR తొలి షెడ్యూల్ తర్వాత దర్శకుడు రాజమౌళి కొంచెం గ్యాప్ తీసుకొన్నాడు. జైపూర్‌లో తన కుమారుడు కార్తీకేయ వివాహం, సంక్రాంతి పండుగ కారణంగా చిత్ర యూనిట్ షూటింగ్‌కు దూరంగా ఉంది. వ్యక్తిగత, ప్రొఫెషనల్ పనులు పూర్తికాగానే మళ్లీ షూటింగ్‌లో మునిగిపోయారు.

రెండో షెడ్యూల్ మొదలుపెట్టాం
తొలి షెడ్యూల్ తర్వాత కాస్త విరామం తీసుకొని మళ్లీ సెట్స్‌పైకి వచ్చాం. రెండో షెడ్యూల్ సోమవారం మొదలైంది అని RRR మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ రోజు షూటింగ్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ పాల్గొనగా భారీ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం.
ఇండియాలోనే మొట్టమొదటిసారి
ఇదిలా ఉండగా, RRR సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారత్‌లోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ షూట్ చేస్తున్నాం అని సెంథిల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కెమెరాకు ఫోజిచ్చిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

350 కోట్ల బడ్జెట్‌తో
RRR చిత్రం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య రూ.350 కోట్లతో రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు, రాంచరణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్టు తెలుస్తున్నది. కీర్తీ సురేష్, రష్మిక మందన్న, ప్రియమణి ఈ చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

2020 సంక్రాంతికి విడుదల
RRR టైటిల్‌పై అనేక ఊహాగానాలు మీడియాలో కొనసాగుతున్నాయి. RRR టైటిల్ అంటే రామ రావణ రాజ్యం అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే టైటిల్‌తోపాటు హీరో, హీరోయిన్ల పేర్లపై చిత్ర యూనిట్ పెదవి విప్పలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











