రాజమౌళికి అందుకే అపజయాలు లేవేమో.. RRRకి కరోనా కూడా ఒక బూస్ట్ లాంటిదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయాలు లేని అతికొద్ది మంది దర్శకులలో రాజమౌళి ఒకరు. కమర్షియల్ సినిమాను అందరికి నచ్చేలా ఎలా తీయాలన్నది జక్కన్నకు వెన్నతో పెట్టిన విద్య. బాహుబలి సినిమాతో బాలీవుడ్ కి సైతం దిమ్మతిరిగేలా సక్సెస్ కొట్టిన రాజమౌళి నెక్స్ట్ RRRతో అంతకంటే హై రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడని షూటింగ్ మొదలవ్వకముందే అందరూ ఊహించడం మొదలుపెట్టారు. కానీ కరోనా వైరస్ ఆ సినిమాపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని కామెంట్స్ వచ్చాయి. ఆ అనుమానాలకు ఒక చిన్న మాటతో రాజమౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

భవిష్యత్తు సినిమాలపై..

భవిష్యత్తు సినిమాలపై..

రాజమౌళి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఆయన మేకింగ్ ద్వారా తెలుస్తోంది. ఇక ఆయన ఇంటర్వ్యూలలో కూడా ఇతర సామాజిక అంశాలపై మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలలో రాజమౌళి భవిష్యత్తు సినిమాల గురించి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఓటీటీ బిజినెస్ అలాగే సినిమాలపై వాటి ప్రభావం ఉంటుందా లేదా అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు.

సినిమా కోసం ఎగబడతారు..

సినిమా కోసం ఎగబడతారు..

ముందుగా RRRపై కరోనా వైరస్ ఎంతవరకు ప్రభావం చూపనుంది అనే దానిపై మాట్లాడిన జక్కన్న కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత ఒక పెద్ద సినిమా విడుదలైతే గనక ఆ సినిమా కోసం జనాలు మాత్రం తప్పకుండా ఎగబడతారని అన్నారు. అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని చెబుతూ ఎలాంటి పెద్ద సినిమా వచ్చినా విడిచిపెట్టరని అన్నారు.

RRR ఒక బూస్ట్ లాంటిదే..

RRR ఒక బూస్ట్ లాంటిదే..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కరోనా వైరస్ వలన భవిష్యత్తులో జనాలు సినిమా థియేటర్ల వద్దకు రారు అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. ఇక రాజమౌళి చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత మంచి సినిమాలు వస్తే మాత్రం జనాలు ఒక్కసారిగా పంజరం నుంచి బయటపడిన పక్షల్లాగా థియేటర్స్ వద్ద వాలడం కాయమని అర్థమవుతోంది. ఒక విధంగా RRRకి అది మాంచి బూస్ట్ అని చెప్పవచ్చు.

Recommended Video

Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media
అందుకే అపజయాలు లేవేమో..

అందుకే అపజయాలు లేవేమో..


ఇక ఓటీటీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదని భవిష్యత్తులో కూడా దాని స్థాయి దానిదే అని థియేటర్స్ లో చూడాల్సిన సినిమాలపై అది అంతగా ప్రభావం చూపకపోవచ్చని కూడా రాజమౌళి తెలియజేశారు. ఒక విధంగా రాజమౌళి కాన్ఫిడెన్స్ చూస్తుంటే అందుకే ఆయనకు అపజయాలు లేవనే కామెంట్స్ వస్తున్నాయి. మరి RRR ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాలి అంటే కరోనా తగ్గే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X