ప్రభాస్ వెర్రిబాగులోడేమి కాదు.. చాలా విషయాలు ఉన్నాయి: రాజమౌళి షాకింగ్ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మొదటి సినిమా నుంచి సాహో వరకు ఎంతగా మారిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే క్రేజ్ లో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ప్రభాస్ గుణంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఆయన సన్నిహితులు చెబుతూనే ఉంటారు. ఇక ప్రభాస్ తన స్నేహితులకు ఎలాంటి వాల్యూ ఇస్తారో అందరికి తెలిసిన విషయమే.

రాజమౌళితో ఫ్రెండ్షిప్..
దర్శకుడు రాజమౌళి ప్రభాస్ కి మంచి స్నేహం ఉంది. ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లను అందుకున్న ఈ కాంబినేషన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రభాస్ తో ఎక్కువ కాలం ట్రావెల్ చేసిన రాజమౌళి దాదాపు ప్రభాస్ గురించి మొత్తం చదివేశాడు. అందుకే అప్పుడప్పుడు సరదాగా ఇంటర్వ్యూలలో ప్రభాస్ బద్దకం గురించి సెటైర్స్ వేస్తుంటారు.

ప్రభాస్ వెర్రి బాగులోడేమి కాదు..
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మరోసారి ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా మంది అనుకుంటున్నట్టుకుగా ప్రభాస్ అంతగా వెర్రిబాగులోడేమి కాదని, పైకి అమయకుడిలా కనిపిస్తాడు గాని లోపల చాలా మేధావి అని చెప్పారు. ఇక ఎవరితో ఎలా ఉండాలో ప్రభాస్ కి బాగా తెలుసని అన్ని విషయాలపై అవగాహన ఉండే ఫిలాసఫర్ అని రాజమౌళి మాట్లాడారు.

రాజమౌళితో సినిమా ఇప్పట్లో లేనట్లే..
అసలైతే గత కొన్ని నెలల క్రితం ప్రభాస్ రాజమౌళితో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ రీసెంట్ గా జక్కన్న మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్టు ఉంటుందని చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ భవిష్యత్ లో ప్రభాస్ తో సినిమా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Recommended Video

ప్రభాస్ ప్రాజెక్ట్స్..
సాహో సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్ నెక్స్ట్ సినిమాలతో అయినా సౌత్ ఆడియెన్స్ కి మంచి కిక్కివ్వాలని రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వైజయంతి మూవీస్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందనుంది.


Click it and Unblock the Notifications











