twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడియెన్స్ కంప్లైంట్ చేయడంతో RRRలో మార్పులు.. రాత్రికి రాత్రే మార్చేసిన రాజమౌళి.. మళ్ళీ కొత్తగా..

    |

    దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR సినిమా ఇటీవల భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తో ఎవరూ ఊహించని విధంగా ఓపెనింగ్స్ అందుకుంది. రోజురోజుకు సినిమా కలెక్షన్స్ అయితే గట్టిగానే పెరుగుతున్నాయి. చూస్తుంటే మరొక వారం పాటు ఈ సినిమా హడావిడి ఏమాత్రం తగ్గేలా లేదు అనిపిస్తోంది.

    అయితే ఈ క్రమంలో ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ఒక విషయం లో కాస్త అసంతృప్తి రావడంతో వెంటనే రాజమౌళి రాత్రికి రాత్రే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలో కాస్త మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    నెంబర్ వన్ ఫ్యాన్ ఇండియా మూవీ

    నెంబర్ వన్ ఫ్యాన్ ఇండియా మూవీ

    రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొదటి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ RRR సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొదటి రోజే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి నెంబర్ వన్ ఫ్యాన్ ఇండియా సినిమాగా గుర్తింపు అందుకుంది. చూస్తుంటే అయితే కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలే లేవు అని అనిపిస్తుంది.

    నార్త్ లో 100కోట్లు

    నార్త్ లో 100కోట్లు

    పోటీగా పలు బాలీవుడ్ సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా RRR సినిమా కలెక్షన్స్ విషయంలో అయితే అస్సలు తగ్గదు అని చెప్పవచ్చు. నార్త్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శుక్రవారం ఎటాక్ అనే మరో బాలీవుడ్ సినిమా విడుదల అవుతున్నప్పటికి RRR హవా కొంచెం కూడా తగ్గలేదు.

    ఫెస్టివల్ కు మరిన్ని కలెక్షన్స్

    ఫెస్టివల్ కు మరిన్ని కలెక్షన్స్

    ఇక మాస్ క్లాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ RRR సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సందడి చేస్తోంది. ఇక రాబోయే మరో రెండు రోజుల్లో ఉగాది ఫెస్టివల్ ఉంది కాబట్టి సినిమాకు మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. అందుకే థియేటర్ల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గించలేదు. సౌత్ లో ఇప్పటివరకు థియేటర్స్ అయితే అస్సలు తగ్గలేదు. నార్త్ లో మరన్ని స్క్రీన్స్ కూడా పెంచబోతున్నరు. మలయాళంలో కూడా కొన్ని స్క్రీన్స్ సంఖ్యను పెంచుతున్నట్లు గా తెలుస్తోంది.

    ఆ విషయంలో అప్సెట్..

    ఆ విషయంలో అప్సెట్..

    అయితే సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఒక విషయంలో అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. సినిమా రెండవ సారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగానే ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బ్రిటిష్ వారికి సంబంధించిన కొన్ని సన్నివేశాల విషయంలో తెలుగులో వాయిస్ ఓవర్ లేకపోవడంతో ఆ సన్నివేశాలు ఇంకా సరిగ్గా మాస్ ఆడియన్స్ కు అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని సన్నివేశాలకు సరిగ్గా వాయిస్ ఓవర్ లేదు. సెకండ్ హాఫ్ లో మిగతా కొన్ని సన్నివేశాల్లో మాత్రం రానా దగ్గుబాటి తో అలాగే నవదీప్ తో ఇంగ్లీష్ బ్రిటిష్ క్యారెక్టర్స్ కు తెలుగులో వాయిస్ ఓవర్ ఇప్పించారు.

    Recommended Video

    RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
    రాత్రికి రాత్రే మార్పులు

    రాత్రికి రాత్రే మార్పులు

    ఆ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ కూడా తెలుగులో అర్థం కాకపోవడంతో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం కాస్త అప్సెట్ అయినట్లు గా తెలుస్తోంది. ఇక వెంటనే రాజమౌళి ఆ విషయాన్ని గ్రహించి మిగతా సన్నివేశాలకు కూడా వాయిస్ ఓవర్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల రాత్రికి రాత్రే రాజమౌళి కొత్త ఆడియో ను పూర్తిగా అన్ని స్క్రీన్ కు చేరే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది ఫెస్టివల్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో సినిమాపై ఎలాంటి అనుమానం లేకుండా పూర్తిగా అందరికి అర్థం అయ్యే విధంగా ఉండాలని రాజమౌళి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడట

    English summary
    Director ss rajamouli sent to all theatres a new Audio with Telugu translation for Britishers dialogues..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X