మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ ఎప్పుడు? కర్రతో కొట్టబోయిన రాజమౌళి

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత గ్లోబల్ లెవల్ పాపులారిటీ సంపాదించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి . దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తెరదించుతూ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న జట్టు కడుతున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారో. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌ని రాజమౌళి ఎలా డీల్ చేస్తారోనన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ నెలకొంది. అయితే ఇన్ని రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు #SSMB29పై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న రాజమౌళిని ఇదే విషయం గురించి అడగ్గా.. ఆయన కొట్టినంత పనిచేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మరోవైపు .. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్‌ను క్యాప్‌తో కవర్ చేస్తూ ఉన్న మహేశ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ క్లీన్ సేవ్‌తో కనిపించే మహేశ్ ఈ సినిమా కోసం గడ్డం కూడా పెంచారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి కొడుకు చేతికి అప్పగించగా.. జక్కన్న దానికి ఫైనల్‌గా రాజముద్ర వేయాల్సి ఉంది.

Director ss rajamouli serious on mathu vadalara 2 team over they asking ssmb29 updates here s the details

రోజులు గడుస్తున్నా ఎస్ఎస్ఎంబీ29 మూవీ అప్‌డేట్స్ ఏం బయటకు రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ నేపథ్యంలో మత్తువదలరా 2 టీమ్ ఏకంగా జక్కన్న నుంచే వివరాలు లాగే ప్రయత్నం చేసింది. శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రితేష్ రైనా దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన మత్తువదలరా -2 ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది.

కాగా.. మూవీ యూనిట్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని కూడా ప్రమోషన్స్‌లో భాగం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇంటి బయట శ్రీసింహా, కాలభైరవ, కార్తీకేయ మాట్లాడుకుంటూ ఉంటారు. మా మూవీకి ప్రమోషన్ కావాలి, టెన్షన్‌గా ఉంది అంటూ అరుస్తుండగా.. కార్తీకేయ బయటికి లోపలివాళ్లను డిస్ట్రబ్ చేయొద్దు అంటాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే ప్రమోషన్ ఏంట్రా అని అడగ్గా తాము మాట్లాడేది మత్తు వదలరా -2 గురించి అని చెబుతారు. కుర్రాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా రాజమౌళి బయటకొచ్చి ఏంట్రా గోలా.. పనిచేసుకోనివ్వరా అని కసురుకుంటారు.

ముందు మా పని అయ్యాక మీ పనిచేసుకోండి బాబా అని చెప్పగా.. ఏంటా పని అని రాజమౌళి అడుగుతారు. మా సినిమాకు గట్టిగా సౌండ్ చేయాలి బాబా లేదంటే మేం సౌండ్ ఆపం అంటారు. డిమాండ్ ఎక్కువైపోయిందిరా అంటూ సెప్టెంబర్ 13న మత్తువదలరా 2 చూసేందుకు థియేటర్స్‌కి వచ్చేయండి అని చెబుతారు రాజమౌళి. చాలా అని జక్కన్న వెళ్తుండగా.. ముగ్గురు కుర్రాళ్లు ఆయనని ఆపి ఎస్ఎస్ఆర్ఎంబీ అప్‌డేట్ చెప్పొచ్చుగా అని శ్రీసింహా అడుగుతాడు. ఆ వెంటనే రాజమౌళి ఇక్కడ కర్ర ఉండాల్రా అంటూ పెద్ద బొంగు తీయగా వాళ్లు పారిపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎస్ఎస్ఎంబీ29 అప్‌డేట్స్ గురించి అడిగేవాళ్లకి జక్కన్న ఇలా స్ట్రోక్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X