కాస్త తగ్గించుకుంటే మంచిది.. సినిమాలపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
కరోనా వైరస్ ఎవరిపై ఎంత ప్రభావం చూపుతుందో రోజుకో ఉదాహరణ ఆందోళనను కలిగిస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీపై అయితే పెద్ద పిడుగు పడినట్లయింది. సినిమా షూటింగ్ నడిస్తే గాని డొక్కాడని ఎంతో మంది కార్మికులకు లాక్ డౌన్ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక సినిమాపై వందల కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతల పరిస్థితి కూడా భయానకంగా మారింది. అయితే బడ్జెట్ విషయంలో కాస్త తగ్గితే మంచిదని దర్శకుడు రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సమాధానం ఇచ్చారు.

ఎప్పుడు మొదలవుతాయో తెలియదు..
లాక్ డౌన్ మరికొన్నాళ్ల పాటు పొడగించడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై మరీంత ప్రభావం చూపిస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీలలో పరిస్థితిలు దారుణంగా తయారవుతున్నాయి. ఈ పాటికి రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. మళ్ళీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఒకవేళ మొదలైనా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.

అందుకే RRR విషయంలో..
లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అందుకే RRR సినిమా రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు సరైన క్లారిటీ ఇవ్వలేమని దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా లైవ్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్న జక్కన్న రీసెంట్ గా మరొక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అలాగే భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరణ ఇచ్చారు.

కాస్త తగ్గించుకుంటే మంచిది..
విడుదల కావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే బడ్జెట్ విషయంలో కాస్త తగ్గితే మంచిది అని రాజమౌళి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో సినిమా టెక్నీషియన్స్ అందరు ఒక మాట మీద నిలబడి సినిమా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మేకింగ్ అనే విషయంలో తగ్గడం కష్టమే అయినా కొన్నాళ్ల వరకు అలా చేయడం తప్పేమీ కాదని అన్నారు.

RRR పరిస్థితేంటి?
రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడే బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయాలని చెబుతుండడంతో RRR లాంటి సినిమా విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 70 శాతం వరకు సినిమా పనులు పూర్తయ్యాయి. హై బడ్జెట్ తో చేయాల్సిన సీన్స్ కూడా మిగిలి ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలానే మిగిలి ఉంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సమయంలో ఏ విధంగా వర్క్ చేస్తుందో అనే చర్చలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











