బాలయ్యను చూసి భయపడిన రాజమౌళి.. అందుకే సినిమా చేయలదంటూ..

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ ఉన్న హీరోల తో ఎక్కువగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపేవారు. స్టార్ హీరో ఇమేజ్ ఉన్న ప్రతీ హీరోతో కూడా వర్క్ చేయాలని అనుకుంటారు. అయితే రాజమౌళితో బాలకృష్ణ ఎందుకు సినిమా చేయలేదు అని చాలామంది అభిమానులలో అనేక రకాల సందేహాలు నెలకొన్నాయి. ఇక ఆ విషయంలో ఇటీవల బాలకృష్ణ రాజమౌళి మొహం మీద అడిగేశారు. అందుకు రాజమౌళి కూడా చాలా ఓపెన్ గా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

బాలకృష్ణ షోలో..

బాలకృష్ణ షోలో..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు ఇటీవల దర్శకుడు రాజమౌళి అలాగే సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యేక అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో బాలకృష్ణ ఎన్నో రకాల సందేహాలను అడిగారు. అంతేకాకుండా తనతో సినిమా చేయకపోవడానికి కారణం ఏమిటని కూడా చాలా ఓపెన్ గా మొహం మీద చెప్పేశారు.

హ్యాండిల్ చేయలేను అని..

హ్యాండిల్ చేయలేను అని..

నాతో సినిమా చేయమని నా అభిమానులు అడిగినప్పుడు ఆయనను నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పారని విన్నాను అది నిజమేనా అని రాజమౌళి అడగగానే అందుకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది అని రాజమౌళి తెలియజేశాడు. ఒక విధంగా మీరంటే నాకు చాలా భయం అని దర్శక ధీరుడు వివరణ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎలా ఉంటానో నాకే తెలియదు

ఎలా ఉంటానో నాకే తెలియదు

రాజమౌళి మాట్లాడుతూ.. మీరంటే ఇండస్ట్రీలో అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మీరు కూడా చిన్న వారు పెద్ద వారు అనే తేడా లేకుండా అందరినీ ఎంతో గౌరవిస్తారు. కానీ నేను మాత్రం ఒక సారి సినిమా సెట్ లోకి వెళితే ఎలా ఉంటానో నాకే తెలియదు. ముఖ్యంగా నా సినిమాలో నటించే హీరోలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోను.

అదే నా టెన్షన్

అదే నా టెన్షన్

ఒకసారి సినిమా షూటింగ్ మొదలు పెడితే నేను చేసే హీరో ఎండలో ఉన్నాడా లేక వానలో ఉన్నాడా అనే విషయాన్ని కూడా పట్టించుకోను. నా ఫ్రేమ్ సిద్ధమయింది అంటే హీరో కష్టసుఖాల గురించి పెద్దగా ఆలోచించను. ఒకవేళ నేను మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే.. మీకు ఏమైనా కోపం వస్తుందేమో అని భయం కూడా ఉంది. అదే నా ముఖ్యమైన టెన్షన్ అని రాజమౌళి తెలియజేశాడు.

రాజమౌళికి బాలయ్య సమాధానం

రాజమౌళికి బాలయ్య సమాధానం

ఇక రాజమౌళి చెప్పిన విషయం పై సున్నితంగా స్పందించిన బాలకృష్ణ తాను ఒకసారి కారావాన్ దిగితే ఆ రోజు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే వరకు కూడా లోపలికి వెళ్ళను అంటూ ఎవరిని కూడా గొడుగు కూడా పట్టనివ్వని అని కూడా తెలియజేశాడు. అంతే కాకుండా దర్శకుడితో సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇస్తే వెనక్కి తిరిగి చూసేది ఉండదని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

 మగధీర కథ చెప్పాను..

మగధీర కథ చెప్పాను..

ఇక దర్శకుడు రాజమౌళి బాలకృష్ణ కు సంబంధించిన మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. తన తండ్రి రైటర్ కే.విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పుడు రెండు మూడు సార్లు బాలకృష్ణ గారి కలిశానని.. ఇక ముఖ్యంగా చత్రపతి సమయంలోనే బాలయ్య గారికి మగధీర కథ కూడా చెప్పినట్లు రాజమౌళి వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X