SS Rajamouli: మంత్రి హరీష్ రావుకు నేను అభిమానిని.. ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్ వైైరల్
జక్కన్న అనే బ్రాండ్ ఇమేజ్ తో ఇండియాలో టాప్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్నారు. చాలామంది హాలీవుడ్ దర్శకుడు సైతం రాజమౌళి మేకింగ్ విజన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించిన విధానంపై సర్వత్ర ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అలాంటి జక్కన్న హరీష్ రావుకు ఫ్యాన్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
మంత్రి హరీష్ రావుపై ప్రశంసలు : తాజాగా జక్కన్న హైదరాబాదులో లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హెల్త్ మినిష్టర్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి హాస్పిటల్ గురించి మాట్లాడటానికి ముందుగా మంత్రి హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారు.15 ఏళ్ల క్రితం సిద్దిపేట మీదుగా నాగపూర్ వెళ్లానని, ఆ సమయంలో నియోజకవర్గ అభివృద్ధి చూసి మీకు ఫ్యాన్ గా మారిపోయానని హరీష్ రావుని ఉద్దేశించి రాజమౌళి చెప్పడం విశేషం.

చాలా డిఫరెన్స్ కనిపించిందని : ఈ సమయంలో మీ పక్కన కూర్చోవడం చాలా గొప్పగా ఫీలవుతున్నట్లు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. నాగపూర్ వెళ్లే సమయంలో ముందు నియోజకవర్గానికి సిద్దిపేటకి చాలా డిఫరెన్స్ కనిపించిందని, అంది స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు గారిని అభిమానిస్తూ ఉన్నట్లు ఈ సమావేశంలో రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇక హరీష్ రావు కూడా రాజమౌళిపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. బాహుబలి సినిమాతో భారతదేశం వ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొస్తే, ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ స్థాయిలో తెలుగు ప్రజలందరూ గర్వించే గౌరవాన్ని రాజమౌళి తీసుకొచ్చారని అన్నారు. ఆస్కార్ అవార్డు సాధించడం నిజంగా గర్వకారణం అని కొనియాడారు.


మహేష్ బాబుతో బిగ్ ప్లాన్ : అభిమానులు ఇదివరకు ఎన్నడు చూడని రీతిలో, సరికొత్త మీకోవర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది మార్చి లోపు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కాగా మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్ గా, అమీర్ ఖాన్ విలన్ గా నటించబోతున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి ప్రశంసలతో హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











