బస్ డ్రైవర్ కొడుకు అని చెప్పగానే.. ఆర్ఆర్ఆర్ కోసం వెళ్ళా, మతిపోయింది.. రాజమౌళి!
కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం హిందీతో పాటు దక్షణాది భాషలన్నింటిలో విడుదలకు సిద్ధం అవుతోంది. యష్ గురించి అంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యష్ లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగే లక్షణాలు ఉన్నాయంటూ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కెజిఎఫ్ ట్రైలర్స్ విడుదలై అదరగొడుతున్నాయి. ఆదివారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

కొత్తకుర్రాడు వచ్చాడు
ప్రీరిలీ ఈవెంట్ లో రాజమౌళి కన్నడలో కొన్ని మాటలు మాట్లాడి ఆకట్టుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం నా స్నేహితులని అడిగా.. కన్నడలో ఏంటి పరిస్థితి అని. పెద్ద హీరోలని పక్కన పెడితే ఇటీవల ఓ కొత్త కుర్రాడు వచ్చాడు వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అతడి పేరు యష్ అని చెప్పారు.

బస్ డ్రైవర్ కొడుకు అనగానే
యష్ అనే పేరు నేనెప్పుడూ వినలేదు. ఎవరీ యష్ అని అడిగా. బస్సు డ్రైవర్ కొడుకు అని చెప్పగాన్నే షాక్ అయ్యానని రాజమౌళి అన్నారు. ఒక బస్ డ్రైవర్ కొడుకు కన్నడలో టాప్ స్టార్ గా ఎదిగాడు అని రాజమౌళి తెలిపారు. తన కొడుకు స్టార్ హీరో అయినప్పటికీ యష్ తండ్రి ఇంకా బస్సు డ్రైవర్ గానే పనిచేస్తున్నారు. ఈ విషయం విని ఇంకా ఆశ్చర్యపోయా అని రాజమౌళి తెలిపారు.

ఆయన పెద్ద స్టార్ అనిపించింది
నేను పెద్ద స్టార్ హీరోని. బాగా సంపాదిస్తున్నాను. ఇంకా ఎందుకు నాన్నా ఈ బస్సు డ్రైవర్ ఉద్యోగం అని యష్ తన తండ్రిని అడిగాడట. నేను ఈ ఉద్యోగం చేసే నిన్ను స్టార్ హీరోని చేశా. కాబట్టి నీపని నువ్వు చేసుకో.. నా పని నేను చేస్తా అని యష్ తండ్రి సమాధానం ఇచ్చారట. దీనితో యష్ కంటే వాళ్ళ నాన్నే పెద్ద స్టార్ అని అనిపించింది.

నా మతిపోయింది
ఆర్ఆర్ఆర్ కథా చర్చల కోసం కొన్నిరోజుల క్రితం బెంగుళూరుకు వెళ్ళా. అక్కడ తాజ్ హోటల్ ఉండగా యష్ అక్కడే ఉన్నాడు. కెజిఎఫ్ టీం మొత్తం అక్కడ ఉంది. కెజిఎఫ్ టీం నన్ను కలసి రెండు నిమిషాల సమయం అడిగారు. కెజిఎఫ్ చిత్రంలోని కొన్ని విజువల్స్ చూపించారు. అద్భుతంగా ఉన్న ఆ విజువల్స్ చూసి నా మతిపోయిందని రాజమౌళి అన్నారు. కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా మంచి విజయం సాదిస్తుందని రాజమౌళి తెలిపారు.


Click it and Unblock the Notifications











