ఎయిర్‌పోర్ట్‌లో వీధి కుక్కలా? ఇలా అయితే పరువు పోదా? రాజమౌళి తీవ్ర అసంతృప్తి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడు కేవలం టాలీవుడ్ దర్శకుడు మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా దర్శకుడు. ఎలాంటి సినిమా చేసినా కూడా దేశవ్యాప్తంగా అందరూ ఆయన సినిమాలు చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రాజమౌళి వ్యక్తిగతంగా సామాజిక అంశాలపై కూడా బాధ్యతగా ఆలోచిస్తుంటారు. వివాదాల్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండే జక్కన్న బయట విషయాలపై చాలా నెమ్మదిగా స్పందిస్తారు. ఇక ఇటీవల ఒక ఎయిర్‌పోర్ట్‌పై ఆయన చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై అసంతృప్తి
దర్శకుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై చేసిన వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. కనీస వసతులు లేకపోవడమే కాకుండా అక్కడ వీధి కుక్కలు తిరుగుతున్న విధానానికి మనం దేశ గౌరవం ఏమైపోతుందని ప్రశ్నించాడు. ఇక ఆ వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం కూడా స్పందించింది.

కనీస వసతులు లేవు
రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా ఎయిర్‌పోర్టులోకి రాగానే RT PcR టెస్ట్ కోసం ప్రయాణీకులందరికి పత్రాలను అందించారు. ఇక వాటిని నింపడానికి కొందరు నేలపై కూర్చుని ఉంటే మరికొందరు గోడపై ఉంచి నింపుతున్నారు. పత్రాలను నింపడానికి కనీసం టేబుల్స్ ఏర్పాటు చేయలేదు. అలాంటి సాధారణ సర్వీస్ అందించకపోతే ఎలా?.. అని అన్నారు.

వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి
అలాగే వెళ్లే ద్వారం వద్ద ఉండే హ్యాంగర్ సమీపంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి దృశ్యాలను విదేశీయుల కంట పడితే మనదేశంపై వచ్చే అభిప్రాయం మరోలా ఉంటుందని చెబుతూ.. ఈ విషయంపై ఫోకస్ పెట్టాలని రాజమౌళి క్లియర్ గా వివరణ ఇచ్చారు. ఇక నెటిజన్లు కూడా జక్కన్న స్పందించిన విధానంపై పాజిటివ్ గా స్పందించారు.

స్పందించిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్
ఇక రాజమౌళి స్పందించిన తీరుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం వెంటనే స్పందించింది. ఇదివరకే అక్కడ అవసరమైనంత టేబుల్స్ ఉండేవని మీరు చెప్పిన దాని భట్టి అక్కడి పరిస్థితిని వీలైనంత పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











