twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెహమాన్‌ జయహో పాటని మొదట కాదన్న దర్శకుడు

    By Srikanya
    |

    రెహమాన్ కి రెండు ఆస్కార్ లు తెచ్చి పెట్టిన జయహో పాటను మొదట బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ రిజెక్టు చేసారుట. ఆయన యవరాజ్ చిత్రం కోసం ఈ ట్యూన్ ని రెహమాన్ స్వరపరిచారుట. అయితే ఈ విషయాలని రెహమాన్ ఖండిస్తున్నారు. దాంతో బాలీవుడ్‌లో ఈ పాట గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జై హో పాట బాణీని తొలుత 'యువరాజ్‌' చిత్రం కోసం తయారు చేశారని.. ఆ చిత్ర నిర్మాత సుభాష్‌ ఘయ్‌ దాన్ని తిరస్కరించారని.. దాంతో ఆ ట్యూన్‌ని 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌'లో వాడారని! ఈ విషయం గురించి రెహమాన్‌ దగ్గర ప్రస్తావిస్తే.. 'ఎవరన్నారు మీతో..? ప్రత్యేకంగా ఏ సినిమా కోసమూ నేను ఈ ట్యూన్‌ను కంపోజ్‌ చేయలేదు. 'యువరాజ్‌' కోసం చేశానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇది కేవలం 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' సినిమా కోసమే రూపొందించాను. ఆ తరవాత ఈ పాట ఏ స్థాయికి వెళ్లిందో మీ అందరికీ తెలిసిందే'' అని వివరించారు. ఒక్కోసారి అంతే మన జడ్జెమెంట్ తప్పుతూంటుంది. పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు కాదన్న కథలు రికార్డులు సష్టించటం మనకు తెలిసిందే కదా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X