twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భవిష్యత్ దొంగ చిత్రాలకు ఆ పాత్ర నమూనా అవుతుంది

    By Srikanya
    |

    భవిష్యత్తులో రాబోయే దొంగ సినిమాలకు రంగ పాత్ర ఓ నమూనాలా మారుతుందనే నమ్మకం ఉంది అంటున్నారు దర్శకుడు సుధాకర్‌నాయుడు(జీవి). శ్రీకాంత్ తాజా చిత్ర రంగ..ది దొంగ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. త్వరలో రిలీజుకు కానున్న ఈ చిత్రం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జీవి ఈ విధంగా చెప్పుకొచ్చారు. అలాగే...శ్రీకాంత్‌ పాత్ర చిత్రణ ఈ కథకు బలం. రమ్యకృష్ణ పాత్ర కూడా కథలో కీలకమే. పాటలు, పోరాట దృశ్యాలు మాస్‌ ని మెప్పిస్తాయి అన్నారు. ఇక ఈ చిత్రం ఓ విచిత్రమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

    అందులో ఒక పాత్ర అల్లరి దొంగ, మరో పాత్ర కరుడు గట్టిన ప్యాక్షనిస్ట్. వీరిధ్దరి మధ్యా జరిగే కథనంతో చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా తయారవుతోంది. ఇక దొంగగా శ్రీకాంత్ ఈ చిత్రంలో కేవలం పోలీసుల ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసే పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం చక్రి అందిస్తూంటే, కెమెరా పూర్ణ కాండ్రు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తో మహాత్మా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించటం విశేషం. అలాగే జీవీ ఇంతకు ముందు నితిన్ హీరోగా హీరో అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చక్రి కూడా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా ఓ గమ్మత్తైన పాత్రను పోషిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X