ఇది నాకు లైఫ్ టైం ఛాన్స్, సాహో పది సినిమాలకు సమానం: సుజిత్

‘సాహో’ లార్జర్ దన్ లైఫ్ కాన్వాస్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా అని.. అందుకే ఒకేసారి పది సినిమాలకు పని చేస్తున్న భావన కలుగుతోందని చెప్పాడు సుజీత్.

Recommended Video

Director Sujeeth About Prabhas "Sahoo" Movie ఇది నాకు లైఫ్ టైం ఛాన్స్

సాహో..! బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ని అమాంతం పెంచేసిన "బాహుబలి" తర్వాత మళ్ళీ అదే స్థాయిని కంటిన్యూ చేసే రేంజ్ ఉన్న సినిమా అంటూ వస్తున్న వార్తలు భారీ ఎత్తున అంచనాలని పెంచేస్తోంది. 'ప్రభాస్' అంటే ఒకప్పుడు లోకల్ యాక్టర్ ఇప్పుడు ఇంటెర్నేషన్స్ స్టార్ లో ఒకడయ్యాడు. ఒకప్పుడు తెలుగు స్క్రీన్ కి మాత్రమే పరిమితమయిన నటుడు. తెలుగు సినిమా రుచిని గ్రాండ్ గా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాతో అందరికి ఒక్క సరిగా ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ వచ్చింది.

లార్జర్ దన్ లైఫ్ కాన్వాస్

లార్జర్ దన్ లైఫ్ కాన్వాస్

ఆ గుర్తింపును క్యాష్ చేసుకుంటున్నాడు మన అమరేంద్ర బాహుబలి. కలక్షన్స్ పరంగానే కాకుండా టెక్నీకల్ గా కూడా సూపర్బ్ అనిపించుకుంది ఈ బాహుబలి సినిమా. ‘సాహో' లార్జర్ దన్ లైఫ్ కాన్వాస్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా అని.. అందుకే ఒకేసారి పది సినిమాలకు పని చేస్తున్న భావన కలుగుతోందని అతను చెప్పాడు.

దృష్టి అంతా

దృష్టి అంతా "సాహో" మీదే

ప్రస్తుతం తన దృష్టి అంతా "సాహో" మీదే ఉందని.. అందుకే దీని తర్వాత ఏ సినిమా చేయాలనే ఆలోచన కూడా తనకు రావట్లేదని.. ఈ సినిమా తనకు అంత ప్రత్యేకమని అతనన్నాడు. ప్రభాస్ తనకు సోదరుడిలాంటి వాడని.. అతడితో తనకు గొప్ప అనుబంధం ఉందని సుజీత్ చెప్పాడు.

 యువి క్రియేషన్స్

యువి క్రియేషన్స్

‘రన్ రాజా రన్' విడుదలయ్యాక సుజీత్ కు వేరే అవకాశాలు వచ్చినప్పటికీ.. ప్రభాస్ తోనే సినిమా చేయాలనే పట్టుదలతో అతను.. రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్నాడు. ప్రభాస్ ‘బాహుబలి' పూర్తి చేసి ఫ్రీ అయ్యాక అతడితో ‘సాహో' మొదలుపెట్టాడు. ‘రన్ రాజా రన్' తీసిన ‘యువి క్రియేషన్స్' సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతుండటం విశేషం.

మరింత ఆసక్తి కరంగా

మరింత ఆసక్తి కరంగా

అసలు ఒకే సినిమా చేసిన ఒక కొత్త దర్శకుడి చేతిలో ఇంత భారీ బడ్జెట్ పెట్టటం ఒక ఎత్తయితే అసలు ఇప్పటివరకూ ఎవరూ ఊహించని సబ్జెక్ట్ అని చెప్పటం మరింత ఆసక్తి కరంగా ఉంది. ఇది తనకు లైఫ్ టైం ఛాన్స్ అని.. ఈ సినిమాకు పని చేయడం పది సినిమాలకు పనిచేసిన అనుభవంతో సమానమని అతనంటున్నాడు. ‘సాహో' గురించి ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ అతనీ వ్యాఖ్యలు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X