సుజిత్ కాబోయే భార్య అందం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ వైరల్!
సాహో దర్శకుడు సుజిత్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. లాక్ డౌన్ లోనే తన భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకున్న యువ దర్శకుడు ఆలస్యం చేయకుండా ముందు ఒక మంచి ఫ్యామిలి లైఫ్ ని సెట్ చేసుకోవాలని రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వినిపిస్తున్నాయి. ఇక ఆ లిస్ట్ లో సుజిత్ కూడా ఎంగేజ్మెంట్ ఈవెంట్ తో వార్తల్లో నిలుస్తున్నాడు.

సుజిత్ ఎంగేజ్మెంట్..
టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా చాలా మంది సినీ స్టార్స్ ఒకేసారి పెళ్లి వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్ సిద్దార్థ్ మూడు ముళ్ళు వేయగా హీరో నితిన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా అందుకు రెడీ అవుతున్నాడు. నిర్మాత దిల్ రాజు సైలెంట్ గా పెళ్లి పనులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సుజిత్ ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలుస్తున్నాడు.

కాబోయో భార్య ఎవరంటే..
సుజిత్ భార్య ఎవరు అనే సందేహాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె సుజిత్ కి ఎప్పటి నుంచో తెలుసట. పేరు ప్రవళిక. ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో డెంటిస్ట్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె చాలా అందంగా ఉండడంతో ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లికి రెడీ..
బుధవారం గోల్కొండ రిసార్ట్స్ సుజిత్, ప్రవళికల ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. వేడుకకు సినీ ప్రముఖులు ఎవరు కూడా హాజరు కాలేదు. కేవలం దగ్గరి బంధువుల సమక్షంలోనే ఈ వేడుకను పూర్తి చేశారు. ఇక పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఈ హీరో మెగాస్టార్ చిరంజీవితో లుసిఫర్ తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించబోతున్నాడు.
Recommended Video

శభాష్ అనిపించుకున్నాడు..
దర్శకుడు సుజిత్ టీనేజ్ వయసు నుంచే షార్ట్ ఫిలిమ్స్ తో తన స్కిల్స్ ని పెంచుకున్నాడు. పాతికేళ్ల వయసులోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కి కథ చెప్పి ఒకే చేయించాడు. ఎడమైనా చిన్న వయసులోనే 300కోట్ల భారీ బడ్జెట్ సినిమా తీసి శభాష్ అనిపించుకున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో సుజిత్ మొదటి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











