షూ విసిరేవాడు, తమ్ముడు వరుణ్ తేజ్ పోకడ చూసి రామ్ చరణ్ ఆశ్చర్యం!
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, బన్నీ తర్వాత ఎంటరైన యువతరంలో అందరి కంటే ముందు ఉన్నాడు వరుణ్ తేజ్. వరుస హిట్లు అందుకోవడంతో పాటు ఎవరూ ఊహించని సబ్జెక్టులను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
ఇప్పటికే పలు విభిన్నమైన సినిమాలు చేసిన వరుణ్ తేజ్... మరికొన్ని రోజుల్లో 'అంతరిక్షం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హాలీవుడ్లో మాత్రమే సాధ్యం అనకునన ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు 'ఘాజీ' ఫేం డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి.

వరుణ్ తేజ్ జడ్జిమెంట్ చూసి రామ్ చరణ్ ఆశర్చం
తమ్ముడు వరుణ్ తేజ్ ఎంచుకుంటున్న సినిమాలు, కథల పట్ల అతడి జడ్జ్‌మెంట్ చూసి రామ్ చరణ్ ఆశ్చర్యపోతుంటారట. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ ‘అంతరిక్షం' ట్రైలర్ లాంచ్ ఈవెంటులో చెప్పుకొచ్చారు.

అలాంటి వారే సూపర్ స్టార్స్ అవుతారు
చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఇలా ఎంత పెద్ద స్టార్స్ అయినా వారి పెర్ఫార్మెన్స్‌తో పాటు సినిమా జడ్జ్ చేసే సామర్థ్యం ఉంటేనే వారు సూపర్ స్టార్లు అయ్యారు. వరుణ్‌కు అలాంటి ఒక మంచి జడ్జిమెంట్ ఉంది. ‘ఫిదా' లాంటి హిట్ తర్వాత ఒక చిన్న డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వడం, ఇపుడు సంకల్ప్‌ను సెలక్ట్ చేసుకోవడం, దీంతో పాటు ఎఫ్ 2 లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూ తన పెర్ఫార్మెన్స్ మరింత మెరుగు పరుచుకుంటున్నాడు... అని సుకుమార్ తెలిపారు.

షూలు విసిరేసేవాడు...
నా కెరీర్ స్టార్ట్ అయింది నాగబాబు గారి ఇంటి నుంచే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తి ఆయనే. ఆ సమయంలో స్కూలు నుంచి వచ్చి వరుణ్ తన పొడవాటి కాళ్లతో షూ అలా విసిరేయడం నాకు ఇంకా గుర్తుంది... అని సుకుమార్ గుర్తు చేసుకున్నారు.

సముద్ర గర్భం నుంచి అంతరిక్షం వెళ్లాడు
అద్భుతం అనే పదం ‘అంతరిక్షం' సినిమాకు సరిగ్గా సరిపోతుంది. ‘ఘాజీ' లాంటి సినిమా తీసిన సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ ఏం సినిమా తీస్తాడు అని ఆలోచించేలోపే సముద్రం అడుగు నుంచి డైరెక్టుగా అంతరిక్షానికి వెళ్లిపోయాడు. మేలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి 1500 సీజీ షాట్లు ఉన్న సినిమా డిసెంబర్లో విడుదల చేయడం అంటే మామలూ విషయం కాదు. దర్శకుడికి ఎంతో ప్లానింగ్, క్రమశిక్షణ ఎంతో పర్ఫెక్టుగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు... అని సుకుమార్ అన్నారు.


Click it and Unblock the Notifications











