మహేష్ బాబు కోసం పుష్ప కథ.. క్లారిటీ ఇచ్చిన సుకుమార్.. రాబోయే సినిమాలు అవే అంటూ
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటు ఉంటాడు. అయితే ఆయన రంగస్థలం లాంటి బాక్స్ ఆఫీస్ హిట్ అనంతరం భారీ అంచనాలతో తెరపైకి తీసుకువచ్చిన పుష్ప శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం విభిన్నమైన టాక్ తో మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్ కెరీర్లో కూడా భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా పుష్ప గుర్తింపు పొందింది. అయితే అసలు ఈ సినిమా కథను మొదట మహేష్ బాబుకు చెప్పినట్లు గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. ఆ విషయంపై దర్శకుడు సుకుమార్ ఒక క్లారిటీ.

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా
ఆర్య సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు సుకుమార్ ఆ తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సుకుమార్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక వన్-నేనొక్కడినే తర్వాత ఆయన కొంత నిరాశ చెందినప్పటికీ ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు.

పాన్ ఇండియా ప్రాజెక్టుగా
సుకుమార్ సినిమా వస్తోంది అంటే అందులో తప్పకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు విభిన్నమైన సీన్స్ ఉంటాయి అని ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి అని అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. ఇక రంగస్థలం లాంటి సినిమాల్లో కూడా డిఫరెంట్ లవ్ ట్రాక్ ను కొనసాగించారు. ఆ తర్వాత వస్తున్న పుష్ప సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోవడంతో ఆ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకువచ్చారు.

మహేష్ కు పుష్ప కథ
పుష్ప కథను మొదట మహేష్ బాబు చెప్పినట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. నిజానికి రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ మహేష్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబుకు ఆ కథ అంతగా ఆసక్తి అనిపించకపోవడంతో దర్శకుడు సుకుమార్ అదేకథను అల్లు అర్జున్ కు చెప్పినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

అది పుష్ప కథ కాదు..
ఇక అదే విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో దర్శకుడు సుకుమార్ ఒక క్లారిటీ ఇచ్చాడు మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని అనుకున్న మాట వాస్తవమే. కానీ అది పుష్ప తరహాలో ఉండదు అని కాస్త విభిన్నంగా మరొక కోణం లోనే ఉంటుంది అని వివరణ ఇచ్చారు. ఫైనల్ గా మహేష్ బాబుకు చెప్పింది మాత్రం పుష్ప స్టోరీ కాదనే కన్ఫ్యూజన్ క్లియర్ చేశారు.

ఆర్య 3..
అయితే పుష్ప సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ ఆ కథకు కొనసాగింపుగా పుష్ప ది రూల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ తో కూడా ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆయన తో కూడా ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్య 3 విషయంలో కూడా భవిష్యత్తులో క్లారిటీ ఇస్తానని సుకుమార్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











