ఆర్య-2లో అల్లు అర్జున్ ది శాడిజమా? సుకుమార్ క్లారిఫికేషన్
ఆర్య-2 చిత్రంలో అల్లు అర్జున్ పాత్రలో హీరోయిజం కన్నా...శాడిజమే ఎక్కువగా కనిపించింది అనే ప్రశ్నను దర్శకుడు సుకుమార్ ముందుంచినప్పుడు ఆయన వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే...శాడిజం అనే మాట సరికాదు. అదో మానసిక సంఘర్షణ. దాదాపు ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం అలాగే ఉంటుంది. కానీ సమాజం కోసం...చుట్టూ ఉన్నవాళ్ల కోసం పైపైన నవ్వులు పులుముకుని తిరుగుతారు. తొలి సన్నివేశంలో అజయ్ ని నీళ్లలోకి తోయడం శాడిజం ఎందుకు అనుకోవాలి? స్నేహితుణ్ని చేసుకోవడం కోసం ఆర్య ఎంచుకున్న మార్గం అనుకోవచ్చు కదా! ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే ఏ ప్రేమికుడైనా ఎదురు తిరుగుతాడు. మా హీరో కూడా అదే చేశాడు. ఆర్య చేసిన ప్రతి పని వెనుక ఓ కారణం ఉంటుంది. సినిమా జాగ్రత్తగా గమనిస్తే ఆ సంగతి మీకే తెలుస్తుంది అన్నారు.
అలాగే మీ చిత్రాల్లో హీరోయిన్స్ కు సొంత ఆలోచనలు ఎందుకుండవు? అన్నదానికి జవాబిస్తూ..నా మూడు సినిమాల్లోని నాయికల పాత్రల్ని పైపైన పరిశీలిస్తే అలాగే అనిపించొచ్చు. కానీ కాస్త లోతుగా గమనించి చూడండి. వాళ్లల్లో సున్నితమైన కోణం కనిపిస్తుంది. 'ప్రేమించాను..' అని చెప్పకపోతే దూకేస్తాడేమో అనే భయంతో 'ఆర్య'లో గీత - అజయ్ కి 'ఐ లవ్ యూ' చెబుతుంది. 'ఆర్య 2'లో కాజల్ పాత్ర కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అంతే తప్ప ఆ పాత్రకు సొంత వ్యక్తిత్వం లేక కాదు అంటూ వివరించారు. ఇక ఆర్య-2 మంచి విజయం సాధించిందని ఆయన చెప్తున్నారు. ఆ విషయం మాట్లాడుతూ.. నిస్సందేహంగా. ఈ రోజు 'ఆర్య 2'కి వస్తున్న స్పందనే దీనికి సాక్ష్యం. దాదాపు రెండేళ్ల మా కష్టం వృథా కాలేదు. అది వసూళ్ల రూపంలో కనిపిస్తూనే ఉంది చెప్పారు.


Click it and Unblock the Notifications











