రాజమౌళి తర్వాత ఆ క్రెడిట్ ఆ డైరెక్టర్ కే దక్కుతుంది...
తెలుగుసినీ పరిశ్రమలో అసిస్టెంట్ దర్శకుల పడే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రూపకల్పన లో అహోరాత్రులు శ్రమించే వీరికి చాలా కొద్ది మంది దర్శకలు మాత్రమే సరైన గౌరవాన్ని ఇస్తుంటారు. ఇక సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ దర్శకలను కొంత మంది దర్శకులు అస్సలు పట్టించుకోరు. తన సినిమా విజయానికి అంతో ఇంతో దోహదపడిన వారు పస్తులు వున్న పట్టించుకోని దర్శకులు వున్న మన తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ దర్శకులను తమ ఇంట్లో వ్యక్తిగా చూసుకొని, వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ధైర్యం కల్పించే దర్శకులు కూడా వున్నారా..! అనిపిస్తుంది సుకుమార్ మంచితనం చూస్తుంటే...
అసిస్టెంట్ దర్శకులను తమ కుటుంబంలోని వ్యక్తులుగా చూసుకునే దర్శకుల్లో రాజమౌళి తర్వాత ఆ క్రెడిట్ సుకుమార్ కే దక్కుతుంది. మొదట్నుంచీ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ దర్శకులను తన కుటుంబంలోని వ్యక్తులుగా భావించే సుకుమార్ తాజాగా మరో సారి తన అసిస్టెంట్ దర్శకుల పట్ల తన ప్రేమను చాటిచెప్పాడు..100%లవ్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తన సహాయ దర్శకులందరికి బైక్ లను గిప్ట్ లుగా ఇచ్చాడు సుకుమార్. అంతే కాదు తన కొత్త సినిమా ప్రారంభం అయ్యే వరకు వాళ్లందరికి నెలసరి అయ్యే ఖర్చును మొత్తాన్ని సుకుమారే అందజేస్తున్నాడని సమాచారం...సుకుమార్ ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర దర్శకులు కూడా ఇలాంటి పద్దతిని పాటిస్తే ఏ అసిస్టెంట్ దర్శకుడు పస్తులు పడుకోవాల్సిన అవసరం రాదేమో...!


Click it and Unblock the Notifications











