twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోవిడ్ బాధితుల కోసం రంగంలోకి పుష్ప డైరెక్టర్ సుకుమార్.. ఫౌండేషన్ ద్వారా విరాళం

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినీ ప్రముఖుల కోవిడ్ బాధితుల కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. కొంతమంది సమయానికి ఆక్సిజన్ అందక కూడా మరణిస్తున్న సంఘటనలు అంతు చిక్కడం లేదు. ఇక దర్శకుడు సుకుమార్ తనవంతు సహాయం చేయడానికి శ్రీకారం చుట్టాడు.

    25లక్షల రూపాయలతో కోనసీమ ఏరియలోని కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అంధించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది కోసం ఎమెర్జెన్సీగా ఉందని ఆజాద్ ఫౌండేషన్ ద్వారా కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన సుకుమార్ వెంటనే తగినంత మందికి సహాయం చేయాలని డిసైడ్ అయ్యారు. కోనసీమ ఏరియాలో ఎవరికైనా ఎమెర్జెన్సీగా ఆక్సిజన్ కావాల్సి వస్తే వెంటనే సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

    Director sukumar donations for oxygen cylinders

    అందుకోసం డైరెక్టర్ సుకుమార్ కలెక్టర్ సహాయం కూడా తీసుకుంటున్నారు. తన చిన్ననాటి స్నేహితులతో కూడా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్లాన్ వేశాడు. ఇక ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఆ పాన్ ఇండియా సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక మొదటి భాగాన్ని వీలైనంత వరకు ఇదే ఏడాది రిలీజ్ చేసి రెండవ పార్ట్ ను వచ్చే ఎడాది విడుదల చేయాలని ప్లాన్ వేశారు.

    English summary
    Even in the Tollywood industry, movie celebrities are coming forward to help for the Kovid victims. It is a known fact that thousands of lives are lost every day in Telugu states. For some time, oxygen deprivation has not been the only cause of death. Director Sukumar took the initiative to help himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X