అల్లు అర్జున్ ను చాలా కష్టపెట్టా..మరోసారి మూడేళ్లు ఇస్తే..సుక్కు కోసం బన్నీ ఇంత త్యాగం చేశారా?
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ ప్రమోషన్ బాధ్యతలను అల్లు అర్జున్ తన భుజాన వేసుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పుష్ప2 ఫ్రీ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బన్నీ తో తన ప్రయాణం ఆర్య సినిమాతో ప్రారంభమైందని, అప్పటినుండి ఇప్పటివరకు బన్నీ ఎదుగుతున్న తీరును గమనిస్తూ వస్తున్నానన్నారు. బన్నీని వ్యక్తిగతంగా.. కెరీర్ పరంగా చాలా దగ్గరుండి తాను గమనిస్తున్నాన్నారు. అప్పటికి ఇప్పటికి బన్నీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. పుష్ప1 , పుష్ప2 సినిమాలు తీయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ పై ఉన్న ప్రేమనే అని, తమ ఇద్దరి బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ లాంటిదని సుకుమార్ పేర్కొన్నారు.

ఏ హీరోయిన్ సీన్ కోసమో.. ఫైట్ కోసమో ఆరాటపడతారు. కానీ, బన్నీ మాత్రం చిన్నచిన్న ఎక్స్ప్రెషన్స్.. కనుబొమ్మ ఎగిరివేయడం, సరైన లిప్ మూమెంట్ కోసం లేదా వాయిస్ మాడ్యుకేషన్ కోసం ఇలా చిన్న చిన్న విషయాలలో తన బెస్ట్ ఇవ్వడానికి బన్నీ ప్రయత్నిస్తాడని, అలాంటి చిన్న విషయాలపై కూడా బన్నీ కేర్ తీసుకుంటారు. కాబట్టే.. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో నిలిచారని ప్రశంసించాడు. బన్నీ యాక్టింగ్ లో చూపించే ఎనర్జీ చూస్తే తనకి కూడా ఎక్కలేని ఎనర్జీ వస్తుందని సుకుమార్ అన్నారు. పుష్ప సినిమా తీయడానికి ప్రధాన కారణం బన్నీ మీద ఉన్న ప్రేమనే అని మరోసారి వెల్లడించారు.
వాస్తవానికి పుష్ప సినిమా కొరకు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లినప్పుడు..తన దగ్గర కథ లేదని, జస్ట్ వన్ ఆర్ టూ సీన్స్ మాత్రమే అతనికి ఎక్స్ప్లెయిన్ చేశానని, బన్నీ తనపై పెట్టుకున్న నమ్మకానికి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ తర్వాత బన్నీ సినిమా కోసం చూపెట్టిన తపనతో .. బన్నీ కోసం ఏదైనా చేయవచ్చనాని, అప్పుడు కథ ప్రిపేర్ చేశానని సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్ వాళ్ళ మిగతా వాళ్ళు కూడా అంతే లెవల్లో తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో బన్నీ కళ్ళల్లో ఎమోషన్ స్పష్టంగా కనిపించింది.
ఇక పుష్ప3 గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పాలని డిమాండ్ చేయడంతో డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ ఇస్తూ.. అల్లు అర్జున్ తన జీవితంలోని ప్రైమ్ టైం తనకు ఇచ్చాడని, దాదాపు ఈ సినిమా కోసం మూడేళ్లు తన విలువైన కాలాన్ని ఇప్పటికే ఇచ్చేస్తారని సుకుమార్ పేర్కొన్నాు. మరో మూడేళ్లు ఇస్తే.. పుష్ప 3 తీయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ విషయాన్ని తన ఫ్రెండ్ బన్నీని అడిగి చెబుతానన్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నారు. అలాగే సుకుమార్ నెక్స్ట్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించబోతున్నారు.ఇలా అల్లు అర్జున్, సుకుమార్ లకు వరుసగా ప్రాజెక్టులు ఉండడంతో ఇప్పట్లో పుష్ప 3 అనేది సాధ్యం కాదని చెప్పాలి.


Click it and Unblock the Notifications











