దర్శకుడు సుకుమార్‌కు తీరని విషాదం.. తీవ్ర దిగ్బ్రాంతిలో..

దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, తన మేనేజర్, నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్‌ ఇక లేరు. నిన్నటి వరకు ఆరోగ్యంగా నవ్వుతూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే ప్రసాద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ప్రసాద్ మరణంతో సుకుమార్ విషాదంలో మునిగిపోయారు. ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.

శనివారం అస్వస్థతకు లోనై

శనివారం అస్వస్థతకు లోనై

టాలీవుడ్ నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్‌ శనివారం అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండె పోటు వచ్చింది. హాస్పిటల్‌కు తరలించే క్రమంలోనే ఆయన మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే దిగ్బ్రాంతికి లోనయ్యాం అని సన్నిహితులు తెలిపారు. ప్రసాద్ స్వస్థలం కాకినాడ. 1967 మే 7వ తేదీన జన్మించారు.ఆయనకు భార్య వింటి పద్మజ, ఇద్దరు కూతుళ్లు వింటి సాయి ప్రణీత, సత్య ప్రణీత ఉన్నారు.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా


దర్శకుడు సుకుమార్‌కు వీఇవీకేడీఎస్ ప్రసాద్‌ అత్యంత సన్నిహితుడే కాకుండా నమ్మకమైన మనిషి. గత కొద్దికాలంగా సుకుమార్‌కు మేనేజర్‌గా ఆయన బాధ్యతలను చూసుకొంటున్నారు. ఇక అమరం అఖిలం, ప్రేమ అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

విషాదంలో సుకుమార్

విషాదంలో సుకుమార్

ప్రసాద్ మృతితో సుకుమార్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తాను ఎప్పుడు నిరాశ, నిస్పృహలో ఉన్నా నా మిత్రుడు అండగా నిలిచేవారు. ప్రసాద్‌తో మాట్లాడితే ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేది. నా జీవితంలో ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం తనకు తీరని లోటు అని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Allu Arjun's Daughter Allu Arha Cute Video | Allu Arjun | Allu Arha | Allu Ayaan
ఆయన లేని లోటు పూడ్చలేనిది

ఆయన లేని లోటు పూడ్చలేనిది


వీఇవీకేడీఎస్ ప్రసాద్‌ మరణం నాకు ఎంతో లోటు. ఆయన లేనిలోటును ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ప్రసాద్ ఏ లోకాలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని సుకుమార్ విషాదంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X