రాజశేఖర్ కారణంగా నా లైఫ్ అలా మారిపోయింది.. శేఖర్ సినిమా ఈవెంట్ లో సుకుమార్ పవర్ఫుల్ స్పీచ్
సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీవిత రాజశేఖర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా ఆయన వారి కూతురు శివాత్మిక కూడా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ప్రత్యెక అతిథిగా పుష్ప దర్శకుడు సుకుమార్ వచ్చారు. ఇక ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడిన విధానం అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా రాజశేఖర్ కారణంగా తాను ఇండస్ట్రీలోకి వచ్చాను అని ఆయన సినిమాలు కూడా తనను ప్రేరణ గా నిలిచాయి అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింరి. పూర్తి వువరల్లోకి వెళితే..

సూపర్ డూపర్ సినిమాలు చూసి
సుకుమార్ మాట్లాడుతూ.. సాధారణంగా స్టేజ్ మీద ఎవరి గురించి అయినా సరే ఎదో ఒకటి మాట్లాడాలి. కానీ రాజశేఖర్ గారి జీవితంతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అది కూడా ఈ సినిమాకు సంబంధించింది. ఆయన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు. ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం.. ఇలాంటి సూపర్ డూపర్ సినిమాలు చూసి ఆయనవీరభిమాని అయ్యాను.. అని అన్నారు.

నా చిన్న తనంలో..
ఇక ఆయన సినిమాలు చూసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నటుడుగా కూడా చేయాలని అనిపించేది. నా చిన్న తనంలో చాలాసార్లు నేను రాజశేఖర్ గారిని చాలా బాగా ఇమిటేట్ చేసేవాడిని. ఆ విధంగా అప్పుడే నేను సినిమాలకు కనెక్ట్ అయ్యాను. ఒక విధంగా రాజశేఖర్ గారి కారణంగానే సినిమాల్లోకి రావడం జరిగింది. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని సుకుమార్ అన్నారు.

పవిత్రమైనది అని
అలాగే మరొక గొప్ప విషయం ఏమిటంటే.. నేను రెగ్యులర్ గా శివాని శివాత్మిక ఇద్దరిని చూస్తూ ఉంటాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడే డబ్బు సంపాదిస్తూ ఇక్కడే అన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ను సినిమాలకు దూరంగా ఉంచుతాం. కానీ ఆయన ఇద్దరి ఆడపిల్లలను హ్యాపీగా ఫీల్డ్ లో తీసుకువచ్చారు. ఆ విధంగా ఇది పవిత్రమైనది అని ఆయన చెప్పకనే చెప్పారు.

మీకు దండలు.
ఈ కార్యక్రమానికి రావడానికి అసలు కారణం జీవిత రాజశేఖర్. ఒక డైరెక్టర్ జాబ్ అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఇక జీవిత గారు తన ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ ఒక సినిమాను డైరెక్ట్ చేయడమంటే చాలా గ్రేట్. అందుకు మీకు దండలు. ఈ సినిమా మీ కోసం మాత్రమే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఎలాంటి హిట్ కొట్టినా
రామజోగయ్య శాస్త్రి కూడా ఈ సినిమాకు అందించిన లిరిక్స్ కూడా అద్భుతం. ఇక ఈ సినిమాలో నటించిన సముద్రఖని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగులో కూడా ఆయన చాలా మంచి సినిమాలను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఎలాంటి హిట్ కొట్టినా కూడా అంతే వినయంగా ఉంటాడు. ఇక ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.. అని సుకుమార్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











