వివాదంలో 'ఫలక్‌నుమా దాస్'.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఎంటరయ్యారు

ఇటీవలే విడుదలైన 'ఫలక్‌నుమా దాస్' మూవీపై ఓ వైపు వివాదాలు చుట్టుముడుతుంటే.. తాజాగా ఓ వీడియో ద్వారా ఆ సినిమాపై టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆదివారం రోజు 'ఫలక్‌నుమా దాస్' సినిమా చూసిన డైరెక్టర్ సుకుమార్.. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని నేరుగా అందరి ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఇప్పటికే వివాదాల పేరిట జనం నోళ్లలో నానుతున్న 'ఫలక్‌నుమా దాస్' మూవీ మరోసారి చర్చనీయాంశం అయింది. ఇంతకీ సుకుమార్ ఏమన్నాడు? ఆ వివరాలు చూద్దామా..

'ఫలక్‌నుమా దాస్' చూడగానే సుకుమార్ ఫీలింగ్స్

'ఫలక్‌నుమా దాస్' చూడగానే సుకుమార్ ఫీలింగ్స్

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కొందరు ప్రేక్షకులు మాత్రం దారుణంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు ఈ సినిమాను చూసిన సుకుమార్‌.. తనకు ఈ సినిమా చాలా నచ్చిందని, ఇందులో ఎలాంటి అభ్యంతర సన్నివేశాలు గానీ.. డైలాగ్స్ గానీ లేవంటూ ఓ వీడియో ద్వారా తెలపడం విశేషం.

ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ చూపించనంతగా..

ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ చూపించనంతగా..

ఫలక్‌నుమా దాస్‌' నాకు చాలా బాగా నచ్చింది. ఎంతో చరిత్రాక నేపథ్యం ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని ఇంత బాగా ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ చూపించలేదు. హైదరాబాద్‌ను ఒకప్పుడు నైజాం నవాబులు పాలించారు కాబట్టి ఈ నగరానికి ఓ ప్రత్యేకత ఉంది. నా సినిమాల ద్వారా హైదరాబాద్‌ నగరాన్ని బాగా చూపించాలని నాక్కూడా ఓ కోరిక ఉండేది.. కానీ ఇప్పటికి కుదరలేదు అని సుకుమార్ చెప్పుకొచ్చారు.

ఇది చాలా గొప్ప విషయమే..

ఇది చాలా గొప్ప విషయమే..

''ఒక కొత్త కుర్రాడు (విశ్వక్‌ సేన్‌) ఆర్టిస్ట్‌ గా చేస్తూనే సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ సినిమాలో కొత్త ఆర్టిస్ట్‌లకు అవకాశం ఇస్తూ దర్శకత్వం వహించాడంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం. సినిమాలో ఉన్న ఆర్టిస్ట్‌లలో అందరి డైలాగ్స్ చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ‘A' సర్టిఫికేట్‌ ఎందుకిచ్చిందో నాకు నేను ఉహించలేను గానీ.. నాకు మాత్రం సినిమాలో ఎక్కడా అభ్యంతకర సన్నివేశాలు కనిపించలేదు'' అన్నారు సుకుమార్.

హీరో బూతులు.. సోషల్ మీడియాలో రచ్చ

ఫలక్‌నుమా దాస్ చిత్రంలో బూతు డైలాగులు ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ బూతులు తిడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టడంతో వివాదం రాజుకుంది. ఈ ఇష్యూ మీడియాలో హాట్ టాపిక్ కావడమే గాక సోషల్ మీడియాలో రచ్చ క్రియేట్ చేసింది. తన మూవీపై నెగెటివ్ ప్రచారం చేసేది విజయ్ దేవరకొండ అభిమానులే అనే కోపంతో విశ్వక్ సేన్ ఇలా రెచ్చిపోయినట్లు చర్చ జరిగింది. అయితే చివరకు విశ్వక్ సేన్ నేరుగా మీడియా ముందుకొచ్చి దానిపై వివరణ ఇచ్చాడు.

నేను తిట్టింది వాళ్ళను మాత్రమే

నేను ఇన్‌స్టాగ్రామ్‌లో బూతులు తిడుతూ మాట్లాడింది నా సినిమా పోస్టర్లు చించిన వారిని, పైరసీ లింగులు పోస్ట్ చేసిన వారిని ఉద్దేశించి మాత్రమే కానీ ఇతర ఏ హీరో అభిమాన వర్గాన్ని కాదు అని విశ్వక్ సేన్ స్పష్టం చేశాడు. అలాగే రివ్యూ రైటర్స్ పై కూడా తనకు ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ లేవని విశ్వక్ చెప్పాడు. దీంతో 'ఫలక్‌నుమా దాస్' రచ్చకు కాస్త బ్రేక్ పడింది. ఈ లోగా సుకుమార్ ఈ సినిమాపై తన ఫీలింగ్స్ చెప్పడంతో మరోసారి 'ఫలక్‌నుమా దాస్' హాట్ టాపిక్ అవుతోంది.

'ఫలక్‌నుమా దాస్' మూవీ

'ఫలక్‌నుమా దాస్' మూవీ

వాన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌ బ్యానర్స్ సంయుక్తంగా 'ఫలక్‌నుమా దాస్' మూవీని నిర్మించాయి. ఈ సినిమా ద్వారా విశ్వక్‌ సేన్‌ నటుడిగా చేస్తూనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. చిత్రంలో విశ్వక్‌సేన్‌, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్‌, తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమతం తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X