Allu Arjun: పుష్ప సినిమాలో బన్నీ నగ్నంగా.. సుకుమార్ రియాక్షన్ ఏమిటంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే భారీ స్థాయిలో వసూళ్లు రావాల్సి ఉంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ సినిమాలో నగ్నంగా ఉండర్ సన్నివేశాలను మార్చేసినట్లుగా క్లారిటీ ఇచ్చాడు.

పూర్తి స్థాయిలో..
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఇదివరకే ఆర్య, ఆర్య 2 వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రంగస్థలం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు సుకుమార్ బన్నీతో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా తెరపైకి తీసుకువచ్చాడు. ఈసారి రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసిన సుకుమార్ ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ను ఇవ్వాలి అనుకున్నాడు. అయితే మొదటి భాగం మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అభిమానులకు నచ్చింది.. అదొక్కటే
పుష్ప మొదటి భాగం లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర అభిమానులు అయితే చాలా బాగా ఆకట్టుకుంది. అతని బాడీ లాంగ్వేజ్ తోపాటు సినిమా పాటలకు తగ్గట్టుగా బన్నీ కనిపించిన విధానం మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా కథ కథనం విషయంలో ఇంకా మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే చాలా బాగుండేది అని కూడా అభిమానుల నుంచి రియాక్షన్ వచ్చింది.

స్క్రిప్ట్ దశలోనే.. చాలా పచ్చిగా..
దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా తన స్క్రీన్ ప్లే తో నే మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు అని ప్రేక్షకుల్లో ఒక మంచి నమ్మకం అయితే ఉంది. కాని పుష్ప సినిమాలో ఆశించినంతగా అలాంటి అంశాలు ఏమీ కనిపించలేదు అని ఓ వర్గం వారు సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేశారు. ఇక స్క్రిప్ట్ దశలోనే కొన్ని సన్నివేశాలను చాలా పచ్చిగా రాసుకున్నట్టు చెప్పిన సుకుమార్ చివరి నిమిషంలో వాటిని మార్చివేసినట్లుగా చెప్పాడు.

బోరింగ్ క్లైమాక్స్..
ప్రేక్షకులను చాలా బోర్ కొట్టించిన సన్నివేశాల్లో క్లైమాక్స్ చాలా దారుణంగా ఉంది అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమాలో ప్రధాన విలన్ గా నటించిన ఫాహాద్ ఫజిల్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా అండర్ వేర్ లో కనిపించే చాలా పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. కానీ ఇలాంటి సినిమాలో అలాంటి క్లైమాక్స్ ను ఊహించడం అంతగా కొత్తగా ఏమి అనిపించ లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

నగ్నంగా బన్నీ..
అసలైతే సినిమాలో ఇద్దరు నటీనటులను కూడా నగ్నంగా చూపించాలని అనుకున్నారట. కానీ అలాంటి బోల్డ్ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించవని ప్రేక్షకులకు చూడడానికి కూడా ఇబ్బంది పడతారేమో అనే ఆలోచనతో చివరి నిమిషంలో సన్నివేశాలను మార్చినట్లు దర్శకుడు సుకుమార్ తెలియజేశాడు. లేకపోతే మొదట స్క్రిప్ట్ రాసుకున్నట్లు గానే సన్నివేశాలను బోల్డ్ గా షూట్ చేసే వాళ్ళమని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

రెండో బాగంలోనే అసలైజ సన్నివేశాలు
ఇక పుష్ప రెండవ భాగంలో అసలైన సన్నివేశాలు ఉంటాయని కూడా సుకుమార్ తెలియజేశాడు. మొదటి భాగంలో కేవలం పాత్రలను పరిచయం చేశాము అని ఇక రెండో భాగంలో మాత్రం చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయని అంటున్నాడు. మరి ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి. పుష్పా ది రూల్ వచ్చే ఏడాది సమ్మర్లో అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి అనుమానం లేదు..
పుష్ప రెండో భాగం షూటింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మరొక 20 శాతం షూటింగ్ పనులను ముగిస్తే సినిమాను విడుదలకు వెంటనే సిద్ధం చేయొచ్చు. అయితే మొదటి భాగం రిజల్ట్ ను బట్టి పుష్ప రెండో భాగం విడుదల విషయంలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి అనుమానం లేదు అని రెండవ భాగాన్ని కూడా ఇందుకు తగ్గట్టుగానే విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











