సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’ ఫస్ట్ లుక్

By Bojja Kumar

హైదరాబాద్: వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న కుమారి 21 ఎఫ్ చిత్రం ఇటీవలే హైరదాబాద్ లో ప్రారంభోత్సవం జరుపుకుంది. రాజ్ తరుణ్, షీనా బజాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ సమర్పణలో పి.ఎ.మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయింది. అందమైన అమ్మాయి బొడ్డు, పక్కనేపుట్టమచ్చను చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమా కాన్సెప్టు ఎలా ఉండబోతోంది? అనే దానిపై సుకుమార్ అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Director Sukumar's Kumari21F first look

దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ గతంలో ‘కరెంట్' చిత్రాన్ని తెరకెక్కించారు. దాని తరువాత అతను చేస్తున్న చిత్రమిదే. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తుండంతో పాటు, రత్నవేలు లాంటి ప్రముఖ పోటోగ్రాఫర్, దేవిశ్రీప్రసాద్ వంటి టాప్ మ్యూజిషియన్ పని చేస్తుండటం కూడా సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది.

సుకుమార్ మాట్లాడుతూ ఈ చిత్రంతో తొలిసారి నిర్మాతగా మారుతున్నాను. చిత్రపరిశ్రమలో స్నేహబంధానికి విలువిస్తారని రత్నవేలు, దేవిశ్రీప్రసాద్ నిరూపించారు. ఈ చిత్రానికి ముగ్గురు హీరోలు, దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, రాజ్‌తరుణ్. సూర్యప్రతాప్ చెప్పిన లైన్ నచ్చి కథ సిద్ధం చేశాను. అతనైతేనే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడని అతనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు.

ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జనవరి మొదటి వారంలో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రత్నవేలు,ప్రొడక్షన్ డిజైనర్:ఎస్.రవీందర్,ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, పాటలు:చంద్రబోస్, మాటలు:పొట్లూరి వెంకటేశ్వరరావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, డ్యాన్స్:ప్రేమ్క్ష్రిత్, సహనిర్మాతలు:ఎం.రాజా, ఎస్.రవికుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X