6 నిమిషాలు 6 కోట్లు.. పుష్ప కోసం కళ్లు చెదిరేలా సుకుమార్, బన్నీ ప్లాన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే అనేక సంచలన విషయాలకు వేదికగా మారుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే రోజున విడుదల చేసిన లుక్‌ విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప సినిమా గురించి మరిన్ని విషయాలు మీ కోసం..

Recommended Video

Director Sukumar Spending 6Cr For 6 Minutes Episode In Pushpa
అక్రమ కలప స్మగ్లింగ్ నేపథ్యంగా

అక్రమ కలప స్మగ్లింగ్ నేపథ్యంగా

అల వైకుంఠపురంలో లాంటి సంచలన విజయాన్ని అందుకొన్న అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. రంగస్థలం తర్వాత సుకుమార్ చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా సెన్సేషనల్‌గా మారింది. శేషాచలం అడవుల్లో చందనం స్మగ్లింగ్ కథా నేపథ్యంగా సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అల్లు అర్జున్ లుక్‌ విభిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.

లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్

లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుప్ఫరాజ్ అనే లారీ డ్రైవర్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్నాడు. పాత్ర స్వభావం ప్రకారం.. ఇంతకు ముందుకంటే భిన్నంగా ముతక వేషంతోపాటు మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాసిన గెడ్డం, చింపిరి జుట్టు అతడి ఇమేజ్‌కు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైన అల్లు అర్జున్ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం అర్ధమైంది.

ఇమేజ్‌కు భిన్నంగా బన్నీ

ఇమేజ్‌కు భిన్నంగా బన్నీ

ఇక పుష్పను సరికొత్తగా మార్చేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నారని, ఈ మూవీలో రెగ్యులర్ డ్యాన్సులు అసలే కనిపించవనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం కొత్తగా, విభిన్నమైన, తెలుగు సినిమా తెరపై చూడని డ్యాన్సులను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఎలాంటి డ్యాన్సులు చేయిస్తున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం

ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం

అలాగే పుష్ప సినిమాలోని ఓ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే ఈ సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్దను తీసుకొంటున్నట్టు సమాచారం. ఓవరాల్‌గా తెరపైన మళ్లీ రంగస్థలం లాంటి మ్యాజిక్‌ను చేసేందుకు సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X