నా సినిమా బాలేదని చెప్పి ఇగో హర్ట్ చేశాడు: సుకుమార్
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ సరన్, శ్రీవిష్ణు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'వీరభోగ వసంత రాయులు', ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌గా అక్టోబర్ 26న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాబా క్రియేషన్స్ బ్యానర్ పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ వెంకట్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ట్రైలర్ రిలీజ్ వేడుకలో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను అబద్దాలు చెబుతాను, కానీ ఈ సినిమా కథే..
సాధారణంగా సినిమా ఫంక్షన్లకు మొహమాటం కొద్దీ వెళతాం. ఆ సమయంలో కొన్ని సార్లు స్టేజీ మీద అబద్దాలు కూడా చెప్పాల్సి రావొచ్చు. కానీ ఈ సినిమా విషయంలో నన్ను కథే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని సుకుమార్ అన్నారు.

అతడు వచ్చినపుడు వద్దనుకున్నాను
ఈ సినిమా ఐడియా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా దర్శకుడు ఇంద్ర నా వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వడానికి వచ్చినపుడు వద్దని చెప్పాను. నా వద్దకు చాలా మంది వస్తుంటారు, కానీ అందరినీ తీసుకునే పరిస్థితి ఉండదు. అపుడు అతడిలోని టాలెంట్ పసిగట్టలేక పోయానని సుకుమార్ చెప్పుకొచ్చారు.

నా సినిమా బాలేదని చెప్పి ఇగో హర్ట్ చేశాడు
ఇంద్రసేన నేను తీసిన ‘1 నేనొక్కడినే' సినిమా చూసి బాగోలేదన్నాడు. బిగినింగులోనే సినిమా పోయిందని గెస్ చేశాను అన్నాడు. అలా ఉండకుండా ఉంటే బావుండు అన్నాడు. అప్పుడు అతడు చెప్పిన మాటకు నా ఇగో హర్ట్ అయింది. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. మంచి విషయం ఉన్న దర్శకుడు.... అని సుకుమార్ పొగడ్తలు గుప్పించారు.

రోహిత్ బ్యాగ్రౌండ్‌తో హీరో అయ్యాడనుకున్నా
ఇలాంటి సినిమాను శ్రీవిష్ణు, నారా రోహిత్ అంగీకరించడం చాలా గొప్ప విషయం. నాకు రోహిత్ సినిమాలన్నీ చాలా డిఫరెంటుగా అనిపిస్తాయి. వీర భోగ వంసత రాయలు పోస్టర్ మీద అతడిని చూసినపుడు ఇదేదో మంచి కథ అయుంటుందని గెస్ చేశాను. రోహిత్ తనకు ఉన్న బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీకి వచ్చేసి హీరో అయ్యాడని భావించేవాడిని. కానీ అతడితో మాట్లాడిన తర్వాత అతడికి సినిమాపై చాలా నాలెడ్జ్ ఉందని అర్థమైంది. న్యూయార్క్‌లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడంతో పాటు ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడని సుకుమార్ గుర్తు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











