మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్.. కాంబో సెట్ అయితే బాక్సులు బద్దలే.. కానీ అసలు విషయం ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా తర్వాత మంచి స్పీడ్ లో ఉన్న చిరంజీవి వరుణ్ తేజ్ సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే తాజాగా చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా సుకుమార్ ప్రకటించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కా వివరాల్లోకి వెళితే

వరుస సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య పూర్తయింది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఆయన. ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా చేసేస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఆయన. ఆ తరువాత బాబీ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. దాని తరువాత వెంకీ కుడుముల- డీవీవీ దానయ్య సినిమా కూడా రెడీగా ఉంది. తాజాగా సుకుమార్ నుంచి వచ్చిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కల నెరవేరబోతోంది
"నా కల నెరవేరబోతోంది. మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టుకోనున్నాను. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాము." అని సుకుమార్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టాయిలో దుమ్ములేపుతున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాతో సుకుమార్ పేరు బాలీవుడ్‌లోనూ మార్మోగిపోతోంది. ఇప్పుడు పుష్ప 2ను పూర్తి చేసే పనిలో పడ్డాడు ఆయన. ఆ తరువాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. చిరంజీవిని డైరెక్ట్ చేయబోతోన్నాను అంటూ సుకుమార్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

యాడ్ కోసం
అయితే సుకుమార్ పెట్టిన పోస్ట్ సినిమా గురించి కాదని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించడానికి చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో ఈయన థమ్స్ అప్, నవరత్న ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన అన్ని బ్రాండ్స్ కి దూరంగా ఉన్నారు. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లో బిజీగా కావడంతో కార్పోరేట్ కంపెనీలు యాడ్స్ చేయడానికి రెడీ అవుతున్నాయి.

ఆ కంపెనీ కోసం
తాజాగా సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పుడు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయకపోయినా ఈ యాడ్ వరకు సుకుమార్.. చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
Recommended Video

అందుకే అలా
ఇక అదే ఫోటోలో వైసీపీకి చెందిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు కూడా కనిపిస్తున్నారు. మొత్తం మీద సుకుమార్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. సినిమా అయితే అధికారిక ప్రకటన వేరే విధంగా ఉండేదని ఇది యాడ్ కావడంతోనే అధికారికంగా ప్రకటించలేదు కానీ సుకుమార్ ఆనందం ఉండబట్టలేక ఇలా ప్రకటించి ఉండవచ్చు అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











