అల్లు అర్జున్‌లో హుషారంతా కనిపిస్తుంది
హైదరాబాద్:''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదానికి ప్రాధాన్యముంది. అల్లు అర్జున్‌లో హుషారంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు సురేంద్ర రెడ్డి అన్నారు. అలాగే పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు
మాస్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకొన్నాడు అల్లు అర్జున్. తనదైన శైలిలో డాన్సులు, ఫైట్లు చేస్తూ అదరగొడతాడు. స్త్టెల్ విషయంలో ఇక మారు మాట్లాడకూడదు. ఆయన వేసే డ్రెస్సులు అబ్బాయిలకే కాదు... అమ్మాయిలకు కూడా తెగ నచ్చుతుంటాయి. అందుకే ఆయన్ని ముద్దుగా స్త్టెలిష్ స్టార్ అని పిలుచుకొంటుంటారు అభిమానులు.

ఇక అల్లు అర్జున్‌కి... ఇప్పుడు సురేందర్‌రెడ్డి జతకలిశారు. ఆయనకి కూడా ఇలాంటి బిరుదే ఉంది. స్త్టెలిష్ డైరక్టర్ అని పేరు సంపాదించుకొన్నారు. వీరిద్దరి కలయికలో 'రేసుగుర్రం' తెరకెక్కుతోంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. సురేందర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఇటీవలే ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. టీజర్‌లో అల్లు అర్జున్ రేసుగుర్రంలా పరిగెత్తడం అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... పోటీకి సిద్ధమైన కుర్రాడు ఎలా ఉంటాడు... చీకట్లను చీల్చుకుంటూ, ప్రత్యర్థుల కళ్లలో భయాన్ని పెంచుతూ, కదన రంగంలోకి దిగుతున్న సైనికుడిలా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మా సినిమాలో హీరోలా ఉంటాడు అంటున్నారు . నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. యాక్షన్, ప్రేమ, వినోదాల్ని మేళవించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











