సైరా క్లైమాక్స్‌ను వందల సార్లు చూశా.. ఇంతవరకు అలాంటి సీన్‌ను ఎవరూ చూసుండరు..

Recommended Video

#SyeRaaNarasimhaReddy : Director Surender Reddy About Sye Raa Movie Climax Scene

తొలి స్వతంత్ర్య పోరాట యోధుడు, రేనాటి వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మెగాస్టార్‌ చిరంజీవి సిద్దమయ్యారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ సైరాను నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..

ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్రబృందం..

ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్రబృందం..

ఐదు భాషల్లో అత్యంత భారీఎత్తున సినిమాను విడుదల చేస్తుండటంతో.. సినిమా ప్రమోషన్స్‌పై మరింత శ్రద్ద పెట్టింది చిత్రయూనిట్‌. సెప్టెంబర్‌ 22న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అనంతరం చిరంజీవి, రామ్‌చరణ్‌ ముంబై, చెన్నై, కేరళ, బెంగళూరు అంటూ నిర్విరామంగా చుట్టేస్తున్నారు. ఇక్కడ తెలుగులో దర్శకుడు సురేందర్‌ రెడ్డి మీడియాతో ఇంటరాక్ట్‌ అవుతూ.. సినిమా గురించి పలు ఆసక్తికర సంఘటనలు వెల్లడించారు.

ఎంత భయపెట్టి ఉంటే.. అలా చేసి ఉంటారు..

ఎంత భయపెట్టి ఉంటే.. అలా చేసి ఉంటారు..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విన్నప్పుడే క్లైమాక్స్‌ను డిజైన్‌ చేశాను. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎన్నో గెజిట్స్‌ను రెఫర్‌చేశాను, చెన్నైకి వెళ్లి రిఫర్‌ చేశాను, ఆయన వెనక పదివేళ మంది వచ్చారని ఉంది. ఆయన ఊరితీసి.. ముప్పై ఏళ్ల వరకు ఆయన తలను అలానే ఉంచారని.. బ్రిటీష్‌ వారు అంత చేశారంటే.. ఆయనింకెంత భయపెట్టి ఉంటారో అన్న కోణం నాకు కనిపించింది అని సురేందర్ రెడ్డి అన్నారు.

కొన్ని వందలసార్లు చూశా..

కొన్ని వందలసార్లు చూశా..

క్లైమాక్స్‌ సీన్స్‌ కోసం చాలా ఖర్చు అయింది. ఈ క్లైమాక్స్‌ సీన్‌ను ఎన్నిసార్లు చూసినా.. భావోద్వేగానికి లోనవుతాను. అలాంటి ఎండింగ్‌ ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరు. ప్రతీ ఒక్కరూ రొమ్ము విరుచుకునేలానే ఉంటుంది. ప్రతీ మెగా అభిమాని, సినీ ప్రేక్షకుడు మెచ్చే విధంగా ఉంటుంది అని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో

రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో

ఎన్నో ప్రత్యేకతలతో వస్తున్న సైరా చిత్రాన్ని దాదాపు 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X