ఆమెతో నా పెళ్లా..సురేంద్ర రెడ్డి

By Srikanya

తాను హీరోయిన్ సింధు తులానిని పెళ్లాడబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని దర్శకుడు సురేంద్ర రెడ్డి వివరణ ఇచ్చారు.రెండ్రోజుల క్రితం దర్శకుడు సురేంద్రరెడ్డిని త్వరలోనే సింధుతులాని పెళ్లాడనుందంటూ చెన్నైకి చెందిన ఓ పత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. దాంతో సురేంద్రరెడ్డి ఈ వార్తలను ఖండించారు. 'అతనొక్కడే' సినిమలో సింధుతులాని హీరోయిన్ గా చేసిందనీ, అందరి హీరోయిన్ల తరహాలోనే ఆమె కూడా తనకు మంచి ఫ్రెండనీ వివరణ ఇచ్చారు. ఫ్రెండ్ షిప్ కే తమ అనుబంధం పరిమితమనీ చెప్పుకొచ్చారు. సూరేంద్రరెడ్డి ప్రస్తుంతం ఓ స్టార్ హీరోతో కొత్త సినిమాకి కూడా రెడీ అవుతున్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతనొక్కడే' చిత్రంలో సింధుతులాని నటించింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందంటూ పుకార్లు షికారు చేశాయి. సురేంద్రరెడ్డి సైతం అలాంటిదేమీ లేదంటూ వివరణ అప్పట్లో ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X