దర్శకుడు సురేందర్ రెడ్డి వివాహం
అతనొక్కడే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై వరస విజయాలు సాధిస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ వివాహానికి మహేష్ ని ఆహ్వానించడానికి సురేందర్ రెడ్డి షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ లో చెబుతూ, సురేందర్ రెడ్డి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకున్నారు. మహేష్ హీరోగా సురేంద్ర రెడ్డి 'అతిథి' చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం రామ్ హీరోగా ఊసరవెల్లి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా ఈ చిత్రంలో చేస్తోంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అలాగే త్వరలో మహేష్ తోనూ మిస్టర్ ఫెరఫెక్ట్ అనే చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో క్రితం సంవత్సరం రిలీజైన కిక్ చిత్రంమంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి వైవాహిక జీవితం బాగుండాలని ధట్స్ తెలుగు కూడా కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











