twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్‌ బ్లాక్ బస్టర్.. ఆ విషయంలో ఇండస్ట్రీలో లీక్.. సురేందర్ రెడ్డి, రాం తాళ్లూరి, సాగర్ కామెంట్స్

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల అరుపులు, కేరింతల మధ్య అంగరంగవైభవంగా సాగింది. ఈ వేడుకలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సాగర్, నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ..

    వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... తారలతో వేడుక కళకళ.. ఎవరెవరూ వచ్చారంటే..

    ఒక మంచి సినిమా చూసి ఏడాదికి పైగా అయింది. జనాల మధ్య పెద్ద సినిమా చూడాలనే కోరిక ఏప్రిల్ 9న చూడబోతున్నాను. అభిమానుల అరుపులు కేకలు మధ్య వకీల్ సాబ్ చూస్తున్నాను. పవన్ కల్యాణ్ రియల్ పవర్ ఏమిటో ఆ రోజు తెలుస్తుంది. వకీల్ సాబ్ రూపొందించిన దిల్ రాజు, శిరీష్ రెడ్డికి థ్యాంక్స్ అని సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు.

     Director Surender Reddy, Sagar speech at Pawan Kalyans Vakeel Saab Pre release event

    వకీల్ సాబ్ సినిమాను రూపొందించిన దిల్ రాజ్‌, శిరీష్‌ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం లేదు. కంగ్రాట్స్ మాత్రమే చెబుతున్నాను. ఆ విషయం ఎందుకో వారిద్దరికి తెలుసు. ఇప్పటికే ఇండస్ట్రీలో అందరికి తెలిసిపోయింది. వకీల్ సాబ్ సినిమా బ్లాక్‌బస్టర్ అనే విషయం ఇప్పటికే లీక్ అయిపోయింది అంటూ నిర్మాత రామ్ తాళ్లూరి పేర్కొన్నారు.

    వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడిగా మారకముందు నేను కూడా ఇదే ఆడిటోరియంలో పవన్ కల్యాణ్ అభిమానిగా కేరింతలు కొట్టాను. ఆయన అభిమానిగా ఇక్కడ ఉండటం నా అదృష్టం. ఓ మంచి సినిమాను తీసిన దిల్ రాజుకు ధన్యవాదాలు అంటూ అని అయ్యప్పనుమ్ కోషియం దర్శకుడు సాగర్ అన్నారు.

    English summary
    Sri Venkateswara Creations, Bay View Projects's Vakeel Saab is set release on April 9th. Dil Raju and Shirish Reddy are the producers and Boney Kapoor is the presenter. Before this movie release, unit organised Pre release event in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X