Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కల్యాణి వస్తే కాళ్లు మొక్కుతా.. ఆమె అంటే పిచ్చి.. భార్యను గుర్తుచేసుకొని సూర్య కిరణ్ కంటతడి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ సూర్య కిరణ్‌కు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో సత్యం లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారు. ప్రముఖ డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఇంటిలో.. తన సొంత ఇంటిలో జరిగిన విషయాలను, సంఘటనలను మీడియాతో పంచుకొంటూ..
శివ బాలాజీ, కౌశల్, రాహుల్ గ్రేట్
ఇక బిగ్‌బాస్ గురించి మాట్లాడుతూ.. అక్కడ టైమ్ ఎంతవుతుందో తెలియదు. బయట ఏం జరుగుతందో తెలియదు. రెండు రోజులు నాకు ఎన్నో వారాలు గడిచినట్టు ఉంది. నాకు ఒక్కవారం ఏడాదిలా గడిచిపోయింది. బిగ్‌బాస్‌లో పూర్తి సమయాన్ని గడిపిన శివబాలాజీ, కౌశల్ మండా, రాహుల్ సిప్లిగంజ్‌కు హ్యాట్సాప్ అని సూర్య కిరణ్ అన్నారు.
Recommended Video
నిజాయితీగా ఆడటం లేదు.. అంతా డ్రామానే
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో ఇంటి సభ్యుల మధ్య డ్రామాలు ఎక్కువ. నిజాయితీగా ఎవరూ ఆడటం లేదు. ఇంట్లో నాన్‌వెజ్ అయినా, ఫుడ్ అయినా పరిమితమే అనే విషయం ముందే తెలుసు. అయినా ఇంటి సభ్యలు ఫుడ్‌ను చూడగానే ఓవరాక్షన్ చేస్తుండటం నాకు నచ్చడం లేదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే ఇంటి సభ్యులు గుర్తుకు రాలేదు. నా గురించి ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోరు అని సూర్య కిరణ్ తెలిపారు.