వల్గారిటీ, వయొలెన్స్..ఎస్వీ కృష్ణారెడ్డి

నా నుంచి ప్రేక్షకులు వల్గారిటీని ఎక్స్ పెక్ట్ చేయరు. ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే క్లీన్ సినిమాలే నానుంచి వస్తాయని అందరికీ తెలుసు. ఆ ఫ్యామిలీ ఆడియెన్స్ టీవీల వద్దే ఉండిపోవడం ఒక మైనస్ పాయింట్. వల్గారిటీ లేకపోతే కొంతమంది రారు. వయొలెన్స్ లేకపోతే ఇంకొంతమంది రారు. నేనేమో అలాంటివి తీయలేను. ఎప్పుడూ మంచి సినిమా కోసమే ప్రయత్నిస్తుంటా అన్నారు. అలాగే మన పరిశ్రమలో మంచి సినిమాల్ని బతికించుకునే మార్కెటింగ్ విధానం సరిగా లేదు. ఇంతకుముందు మంచి సినిమాకు అనుకూలంగా ఉండేది ఆ విధానం.
ఇప్పడు ది ప్రతికూలంగా ఉందని బాధపడ్డారు. ఇక తన కొత్త సినిమా గురించి చెబుతూ మంచి సబ్జెక్టును సిద్ధం చేసే పనిలో ఉన్నా. నా సినిమాలో కామెడీ ఎలాగూ తప్పదు. కమర్షియల్ గా ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నా. బహుశా మూడు నెలల్లో మొదలు కావచ్చునని అన్నారు. ఆయన మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చి సూపర్ హిట్టు ఇవ్వాలని కోరుకుందాం. ఇంతకీఇవాళ ఆయన పుట్టినరోజు. శుభాకాంక్షలు కూడా అందిద్దాం.


Click it and Unblock the Notifications











