Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి హాలీవుడ్ ఫిల్మ్
మరో తెలుగు దర్శకుడు ప్రపంచ సినిమా ఫ్లాట్ ఫారమ్ మీద అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆర్.పి. పట్నాయక్ "Amy - The Movie" అనే ఇంగ్లీష్ చిత్రం ద్వారా వార్తల్లోకెక్కగా....తాజాగా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన తొలి ఇంగ్లీష్ చిత్రం 'డైవోర్స్ ఇన్విటేషన్'(Divorce Invitation) చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్దం అయ్యారు.
రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈచిత్రంలో అందరూ హాలీవుడ్ నటులే నటించారు. ఇప్పటికే 38 తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న ఎస్.వి.కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఏకంగా హాలీవుడ్ సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈచిత్రానికి గాను ఆయన బాలారాజశేఖరునితో కలిసి స్ర్కిప్టు వర్క్ చేశారు.
ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్లు జానథన్ బానెట్, జామీ లైన్ సింగ్లర్, నదియా బ్జోర్లిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం విషయమై ఎస్.వి.కృష్టారెడ్డి సన్నిహితుడైన ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డిని ప్రశ్నించగా....త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి కృష్ణారెడ్డి సిద్దంగా ఉన్నారని చెప్పారు.