twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వ్యక్తి కారణంగానే ఉదయ్ కిరణ్ హీరో అయ్యాడు.. రెమ్యునరేషన్ ఎంతంటే.. తేజ సెన్సేషనల్‌గా

    |

    చిత్రం, నువ్వు నేను సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో హీరోగా ఉదయ్ కిరణ్ నిలదొక్కుకొన్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో బిజీ హీరోగా మారిపోయారు. అయితే చిత్రం, నువ్వు నేను సినిమాలకు ముందు అసలు ఉదయ్ కిరణ్ హీరోనే కాదనే విషయాన్ని తేజ సంచలనాత్మకంగా వెల్లడించారు. ఉదయ్ కిరణ్ ఎలా హీరోగా మారాడనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తేజ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

    క్షణక్షణం సినిమా సమయంలోనే

    క్షణక్షణం సినిమా సమయంలోనే

    చిత్రం సినిమాతో డైరెక్టర్‌గా మారాను. అంతుకుముందు నేను కెమెరా అసిస్టెంట్‌గా, రాంగోపాల్ వర్మకు అసిస్టెంట్‌గా, ఆ తర్వాత కెమెరామెన్‌గా పనిచేశాను. క్షణక్షణం సినిమా కథ, స్క్రీన్ ప్లే రాసేటప్పుడే చిత్రం కథ రాశాను. అంటే 1991లో పూర్తి చేసిన కథను సినిమాగా 2000లో మొదలుపెట్టాను అని తేజ అన్నారు.

    చిత్ర సినిమాకు ఉదయ్ కిరణ్ హీరో కాదు

    చిత్ర సినిమాకు ఉదయ్ కిరణ్ హీరో కాదు

    చిత్రం సినిమాకు మొదట ఉదయ్ కిరణ్ హీరో కాదు. వేరే ఒక వ్యక్తిని అనుకొన్నాం. ఉదయ్ కిరణ్ హీరో ఫ్రెండ్‌గా నటించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో హీరో అనుకొన్న వ్యక్తి చేయనన్నారు. దాంతో ఉదయ్ కిరణ్‌తో నువ్వే హీరో అన్నాం. ఆ తర్వాత మళ్లీ ఆ హీరో వచ్చి నేనే చేస్తా అన్నారు. దాంతో మళ్లీ ఉదయ్ కిరణ్‌ను నువ్వు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమంటే సరేనన్నాడు. చివరకు ఆ వ్యక్తి చేతులెత్తేయడంతో ఉదయ్ కిరణ్‌కే హీరోగా ఛాన్స్ దక్కింది.

    ఉదయ్ కిరణ్ పారితోషికం ఎంతంటే

    ఉదయ్ కిరణ్ పారితోషికం ఎంతంటే

    చిత్రం సినిమాలో నటించిన, పనిచేసిన వారందరికీ ఒకే రెమ్యునరేషన్ ఇచ్చాం. ఉదయ్ కిరణ్‌కు 11 వేల రూపాయలు, నాకు 11 వేల రూపాయలు, ఆర్పీ పట్నాయక్‌కు 11 వేలు, ఇంకా వేరే వాళ్లకు కూడా 11 వేలే ఇచ్చాం. అలా తక్కువ రెమ్యునరేషన్లతో చిత్రం సినిమాను పూర్తి చేశాం అని తేజ అన్నారు.

    నువ్వు నేను కోసం మాధవన్ అని..

    నువ్వు నేను కోసం మాధవన్ అని..

    ఇక నా రెండో సినిమా తర్వాత ఫ్యామిలీ సర్కస్, ఆ తర్వాత నువ్వు నేను స్టార్ట్ చేశాం. ఫ్యామిలీ సర్కస్ యావరేజ్‌గా ఆడింది. నువ్వునేను సినిమాకు మాధవన్‌ను హీరోగా అనుకొన్నాం. ఇక చిత్రం తర్వాత ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ మా ఆఫీస్‌కు వచ్చి కూర్చొనేవాడు. ఆ సమయంలో నిధి ప్రసాద్ సినిమాకు ఉదయ్ కిరణ్ పనిచేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా మొదలు కాకపోవడంతో ఉదయ్ కిరణ్ టెన్షన్‌లో ఉన్నాడని తేజ చెప్పారు.

    Recommended Video

    Ravi Teja & Sai Dharam Tej To Team Up For Multi-Starrer
    మాధవన్ తప్పుకోవడంతో ఉదయ్ కిరణ్‌కు ఛాన్స్

    మాధవన్ తప్పుకోవడంతో ఉదయ్ కిరణ్‌కు ఛాన్స్


    నువ్వు నేను కోసం మేము మాధవన్ ప్రయత్నిస్తే తాను తెలుగు సినిమాలో నటించనని చెబితే ఏం చేయాలో తోచలేదు. పక్కనే ఉన్న ఉదయ్ కిరణ్ చూసి నువ్వే మా సినిమాకు హీరో అన్నాం. అలా నువ్వునేనులో ఉదయ్ కిరణ్ హీరో అయ్యాడు. ఆ తర్వాత సినిమా భారీ హిట్ కావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది అని తేజ తెలిపారు.

    English summary
    Director Teja has revealed interesting points about Late Uday Kiran. He revealed How Teja selected? How he has been chosen for Nuvvu Nenu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X