ఉదయ్ కిరణ్‌ని ఇండస్ట్రీలో తొక్కేసారా అంటే : దర్శకుడు తేజ

By Srikanya

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీలో తొక్కేసారా అన్న ప్రశ్న ప్రశ్నకు... చిత్ర పరిశ్రమలో తొక్కేసారా లేదా అన్నది తనకంటే మీడియాకే బాగా తెలుసు అని... ప్రముఖ దర్శకుడు తేజ సమాధానమిచ్చారు. కొద్ది రోజుల క్రితం ధర్మవరపు సుబ్రమణ్యం చనిపోవటం, ఇప్పుడు ఉదయ్ కిరణ్ సూసైడ్ చాలా బాధాకరమన్నారు.

తను చిత్రం సినిమా ద్వారా పరిచయం చేసిన హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో షాక్ కు గురి అయినట్లు దర్శకుడు తేజ తెలిపారు. తనకు ఓ ప్రెండ్ ఫోన్ చేసి విషయం చెప్పారని, అది నిజం కాకపోతే బాగుండునని ఆయన అభిప్రాయం వెల్లబుచ్చారు.

Director Teja about Uday Kiran Death

తను చివరి సారిగా ఉదయ్ కిరణ్ ని అతని పెళ్లిలో కలిసానన్నారు. అప్పుడు అతను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. తనను కలవాలని ఉదయ్ కిరణ్ అడిగితే ...తన కెరీర్ బాగోనందున కొంత టైమ్ తీసుకుందామని చెప్పినట్లు తెలిపారు. తను ఉదయ్ కిరణ్ తో సినిమా చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఊహించని విధంగా ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు.

ఇక సినిమాలు లేకపోతే ఏ నటుడైనా డిప్రెషన్ కి గురి అవుతాడని, నటులకు సినిమాలు తప్ప, మరేమీ తెలియవని ఆయన అన్నారు. మీసాలు కూడా రాని ఉదయ్ కిరణ్ ని తానే చిత్ర పరిశ్రమకు పరిచయం చేసానని, చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చారు. పొరపాటున కూడా ఎవరికీ హాని కలిగించే మనస్తత్వం కాదని ఆయన అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X