ఉదయ్ కిరణ్ బయోపిక్ పై దర్శకుడు తేజ క్లారిటి ఇచ్చాడు!
నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 'నువ్వునేను' సినిమాతో ఉదయ్ కిరణ్‌ని తెలుగు తెరకి పరిచయం చేసిన తేజ ఆయన జీవితంలో మంచీచెడులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలను తెలిసిన వాడిగా తేజ ఈ సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కాని తాజా సమాచారం మేరకు ఈ న్యూస్ లో నిజం లేదని సమాచారం. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసే ఆలోచనే తనకు లేదని, ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడంలేదని అన్నారు తేజ. గత రెండు రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి న్యూస్ మనం వింటున్నాం. కాని ఆ రూమర్స్ ను తేజ కొట్టిపాడేయడం జరిగింది.

తేజ తన తర్వాతి చిత్రం పూర్తి యాక్షన్ నేపద్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. రానా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వెల్లడించారు. తేజ క్లారిటీతో ఉదయ్ కిరణ్ బయోపిక్స్‌కి సంబంధించిన రూమర్స్‌కి బ్రేక్ పడింది. త్వరలో రానాతో చెయ్యబోయే సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











