తేజానా కూజానా? అలా ముఖం చాటేస్తారు... ఎన్టీఆర్ గురించి తేజ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్‌లో దర్శకుడు తేజది ప్రత్యేకమైన శైలి. ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్టు చెప్పడం ఆయన నైజం. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సీత చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. ఈ సందర్భంగా తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. తేజ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

పాత్రను బట్టే హీరో ఎంపిక చేస్తా
ఏ సినిమాలోనైనా పాత్రకు తగినట్టు హీరోను ఎంపిక చేసుకొంటాను. ఫలానా పాత్రకు సరిపోతాడనుకొంటే ఇమేజ్ దృష్టిలో పెట్టుకోకుండా హీరోను తీసుకొంటాను. హీరో ఇలా ఉండాలి.. హైట్, తెల్లగా ఉండాలి లాంటివి నేను పట్టించుకోను. ఆ పాత్రలో ఒదిగిపోతాడా అనే విషయాన్ని మాత్రమే చూసుకొంటాను అని తేజ అన్నారు.

కాజల్ అలా ఒదిగిపోయింది
కాజల్ అగర్వాల్‌తో నాకూ మూడో సినిమా. సీత మూవీ కథ చెప్పగానే తాను చేయడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాతనే బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఎంపిక చేసుకొన్నాం. కాజల్ టాలెంటెడ్ యాక్టర్. సీత పాత్రలోకి నేరుగా ఒదిగిపోయింది. దాంతో నాకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది అని తేజ తెలిపారు.

ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం
సినీ ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. హిట్టు ఉంటేనే ముఖం చూస్తారు. ఫెయిల్యూర్ ఉంటే పట్టించుకోరు. చిన్న సినిమా హిట్ అయినా పెద్ద హీరో చేస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే చిన్న హీరో కూడా వెనుకాడుతారు. తేజ లేదా కూజా అనే విషయాన్ని కూడా పట్టించుకోరు అని తేజ అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి
టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పమని అడుగగా.. ఆయన గురించి చెప్పే స్థోమత నాకు లేదు. ఆయన గురించి నేను ఏం చెప్పగలను. కాకపోతే ఎన్టీఆర్ మంచి నటుడు. ఫెర్ఫార్మర్. అంతకంటే పెద్దగా నాకు తెలియదు అని అన్నారు. హీరోయిన్ల విషయంలో ఫలానా తార ఇష్టమంటే మిగితా వాళ్లు బాధపడుతారు. నాతో పనిచేసిన వాళ్లందరూ ప్రతిభావంతులే అని తేజ అన్నారు.


Click it and Unblock the Notifications











