జీవితంలో అలాంటి పని చేయను.. నాకైతే చేతకాదు.. అన్నీ రూమర్సే.. డైరెక్టర్ తేజ

టాలీవుడ్ దర్శకుల్లోకెల్లా తేజ ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకొవచ్చు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే చెప్పేయడం డైరెక్టర్ తేజ నైజం. అది సినిమాల్లో అయినా సరే, నిజ జీవితంలో అయినా సరే స్టేట్ ఫార్వార్డ్‌గా ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది కుండ బద్దలు కొట్టేసేలా చెప్పేస్తుంటాడు తేజ. ఇక తనపై పుట్టుకొచ్చే రూమర్స్ విషయంలో తేజ స్పందన మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంతో తాజాగా తనపై వస్తున్న ఓ రూమర్‌ని తనదైన శైలిలో ఖండించాడు తేజ. వివరాల్లోకి పోతే..

 గతంలో తేజ.. ఇప్పుడు తేజ

గతంలో తేజ.. ఇప్పుడు తేజ

గతంలో టాలీవుడ్ తెరపై కొత్త కథలకు శ్రీకారం చుట్టడమే కాదు.. ఎందరో కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించాడు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, జయం లాంటి చిత్రాలు భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆయన.. ఆ తర్వాత కాస్త డీలా పడ్డాడు. ప్రస్తుతం సెలక్టెడ్ సినిమాలు మాత్రమే రూపొందిస్తున్నాడు.

తేజపై పుట్టుకొచ్చిన రూమర్స్

తేజపై పుట్టుకొచ్చిన రూమర్స్

ఇటీవలే కాజల్ ప్రధాన పాత్రలో 'సీత' సినిమా రూపొందించాడు డైరెక్టర్ తేజ. ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆయన మరోసారి వెలుగులోకి వచ్చేశాడు. దీంతో తేజ గురించిన టాపిక్స్, ఆయన గురించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఇతర దర్శకుల లాగే తేజ కూడా..

ఇతర దర్శకుల లాగే తేజ కూడా..

ఇప్పటికే ఎందరో దర్శకులు దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే వెండితెరపై కూడా కనిపించారు. దాసరి నారాయణరావు, కోడి రామక‌ృష్ణ, రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్, దేవి ప్రసాద్, కాశీ విశ్వనాథ్ ఈ లిస్టులో చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. అయితే వారి బాటలోనే తేజ కూడా వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యాడని, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో తేజ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

రియాక్ట్ అయిన తేజ.. ఏమన్నాడంటే

రియాక్ట్ అయిన తేజ.. ఏమన్నాడంటే

దీంతో తనపై వస్తున్న ఈ వార్తలపై తేజ స్పందించాడు. తనకు నటించాలనే ఆలోచన లేదని, తాను నటుడిగా మారనని అన్నాడు. తనకు నటించడం చేతకాదని, జీవితంలో వెండితెరపై కనిపించానని తేజ చెప్పాడు. తన నటన విషయమై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తేల్చేశాడు తేజ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X