ఎన్టీఆర్ బయోపిక్: తేజకు అదో పెద్ద సవాల్.., ఎక్కువ ఆలోచించవద్దన్న బాలయ్య!
వివాదాల్ని తడమకుండా కొన్ని కథల్ని ముగించలేం. సరే, ఎలాగోలా లాగించేద్దామనుకున్నా!.. కొన్ని పాత్రల ప్రస్తావన లేకుండా కథ ఒక రూపం తీసుకోవడం కష్టం. కాబట్టి ఆ పాత్రలూ ఉండాలి.. అదే సమయంలో వాటిపై అంత ఫోకస్ ఉండకూడదు అన్న రీతిలో దర్శకుడు తేజ 'ఎన్టీఆర్' బయోపిక్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఏంటీ సంగతి..

తేల్చుకోలేకపోతున్న తేజ..:
ఎన్టీఆర్ బయోపిక్ కోసం కాస్టింగ్ మొదలుపెట్టేశారు దర్శకుడు తేజ. అయితే సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం, అక్కినేని నాగేశ్వరరావు వంటి పాత్రల కోసం ఎవరిని ఎంచుకోవాలి?.. అసలు ఆ పాత్రలను ఎంతమేర చూపించాలి? అన్న విషయాన్ని దర్శకుడు తేజ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.

బాలయ్య సలహా..:
తేజ తర్జనభర్జనలపై బాలయ్య కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో వీలైనంత తక్కువ పాత్రలతోనే కథ చెప్పాలని, పాత్రల ఎంపిక కోసం కూడా ఎక్కువగా ఆలోచించవద్దని తేజకు సూచించారట.

ఫేస్ రికగ్నిషన్ టెస్ట్:
సినిమాలో బసవతారకం పాత్రకు సూటయ్యే ఆర్టిస్ట్ కోసం తేజ 'ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ'ని ఉపయోగించుకుంటున్నారట. బసవతారకం గారి పోలికలకు దగ్గరగా ఉండే నటీమణులని ఎంచుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

నాగేశ్వరరావు పాత్రపై?..:
ఇకపోతే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు-ఎన్టీఆర్ మధ్య సీన్లు కూడా కీలకంగా మారనున్నాయి. దీంతో ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలో తేజకు అర్థం కావట్లేదట.
పోనీ.. అక్కినేని ఫ్యామిలీని సంప్రదిద్దామా? అంటే.. బాలయ్యతో వాళ్లకు గ్యాప్ వచ్చినట్లు తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నారట. అటు బాలయ్యకు కూడా అందుకు నో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

తేజ ఏం చేస్తాడో?:
ఓవైపు నటీనటుల ఎంపికనే సవాల్ అనుకుంటే.. ఎన్టీఆర్ బయోపిక్ తెరపై ఆవిష్కరించడం అంతకన్నా పెద్ద సవాల్. ఎన్టీఆర్ జీవితంలో ఆయన అనుభవించిన క్షోభ తాలుకు నేపథ్యాన్ని టచ్ చేయడం అనుమానమే. అలాగే తెరపై కనిపించే పాత్రల్లో ఏమాత్రం వక్రీకరణ జరిగినా.. విడుదల తర్వాత వివాదాలు ముసురుకోవడం ఖాయం. కాబట్టి తేజ ఈ గండాలన్నింటిని ఎలా గట్టెక్కుతాడో చూడాలి!..


Click it and Unblock the Notifications











