తేజకి అక్కడ డిమాండ్?
అప్పట్లో తేజ తీసిన చిత్రం సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా హిందీ లో తేరే సంగ్ పేరుతో ఫ్రీమేక్ అవుతోందని వార్తలు వినపడుతున్నాయి. తెలుగు, తమిళ సినిమా లను హిందీ లోకి అనువాదం చేసే సతీష్ కౌశిక్ ఈ చిత్రం డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తూంది. అలేగే ఈ రోజు(శుక్రవారం) విడుదల కానున్న షార్ట్ కట్ అనే హిందీ సినిమా కుడా తేజ గతంలో తీసిన ఒక విచిత్రం అనే సినిమా కి హిందీ వెర్షన్ అంటున్నారు. హాలీవుడ్ చిత్రం బౌ ఫింగర్ కి తెలుగు ఫ్రీ మేక్ గా అప్పట్లో ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు దానిని హిందీ లోకి ఎత్తుకున్నారు.అందుకే తన ఆలోచనలు బాలీవుడ్ కి సరిపోతాయని తేజ అంటుంటాడని తేజ అభిమానులు అంటున్నారు. కేక సినిమా తర్వాత తేజ ఒక్క చిత్రం కూడా కమిట్ కాలేదు. తన చిత్రం ప్లాప్ అని తన తదుపరి చిత్రం టైటిల్ అదే అని ట్యాగ్ లైన్ ఇంకా డౌటా అని అప్పట్లో తన పైన తానె జోక్ వేసుకున్న తేజ తన ట్రెండ్ నడుస్తోంది కాబట్టి బాలీవుడ్ కి వెళ్ళే సమయం వచ్చింది అంటున్నారు.


Click it and Unblock the Notifications











