twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్ డౌన్‌ను అలా వాడేస్తున్నాడట.. డైరెక్టర్ తేజ రూటే వేరు

    |

    ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌కు గుప్పిట్లో చిక్కుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. ఇక లాక్ డౌన్‌లో అందరూ ఇంటి పట్టునే ఉండటంతో ఒక్కొక్కరు ఒక్కోలా ఈ సమయాన్ని వాడుకుంటున్నారు. కొందరు సెలెబ్రిటీలేమో వంటింట్లో చేరి కొత్త రకమైన రెసిపీలపై ప్రయోగాలు చేస్తున్నారు. మరికొందరు పెయింటింగ్, డ్రాయింగ్ అంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

    అయితే దర్శకుడు తేజ మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచిచాడు. తన ఫీల్డ్‌కి సంబంధం లేని ఓ కోర్స్ ని మొదలుపెట్టారు. ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్స్ లో తన పేరును నమోదు చేసుకున్నాడట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోర్స్‌ని అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాధిని స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యాడట.

    Director Teja Learning Online Course In Quarantine

    కరోనా లాంటి అంటువ్యాధులు ప్రభలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటి విపత్తులకు ఎలా సిద్దంగా ఉండాలో ఈ కోర్స్ ద్వారా తెలుసుకోబోతున్నాడట. అంతేకాదు...వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరితే తాను వాలంటర్‌గా పనిచేయడానికి కూడా సిద్దమేనట. తేజ ప్రస్తుతం 'అలిమేలు మంగ వెంకట రమణ', 'రాక్షసరాజు రావణాసురుడు' అనే రెండు సినిమాలు ప్రకటించాడు.

    English summary
    Director Teja Learning Online Course In Quarantine. He Says That it was his curiosity about novel coronavirus that led him to take up the course.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X