»   » వర్షంతో దర్శకుడు తేజ ‘హోరా హోరీ’

వర్షంతో దర్శకుడు తేజ ‘హోరా హోరీ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫిలిం మేకర్‌గా తేజ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ కథలను ఈ విధంగా కూడా తీయవచ్చా అని యావత్ సినీ పరిశ్రమ ముక్కున వేలేసుకొనేలా చేసిన ఘనుడు. తాను ఎంచుకునే కథ, కథనాల్లో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపెడుతూ...ప్రేక్షకులకు కొత్త దనాన్ని అందించడంలో తేజ వైలి వేరు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం 'హోరా హోరీ'.

తన చిత్రాల ద్వారా తెలుగు తెరకు యంగ్ టాలెంటును పరిచయం చేసే తేజ...'హోరా హోరీ' చిత్రంతో దిలీప్ అనే యువ ప్రతిభాశాలిని వెండితెరపై ఆవిష్కరించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి చేయనున్నారు.

Director Teja new movie 'Hora Hori'

ఈ చిత్రం గురించిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే...కథానుగుణంగా సినిమా మొత్తం వర్షంలోనే ఉంటుంది. అయితే...ఆ వర్షపు సన్నివేశాలను సహజంగా చిత్రీకరించేందుకు ఈచిత్రాన్ని వానా కాలంలో ప్రారంభించనున్నారు. ఈ సారి వర్ష పాతం తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో తేజ 'హోరా హోరీ ' సినిమా ఈ వానాకాలం పూర్తవుతుందో? లేదో చూడాలి.

ఈ చిత్రం అనంతరం తేజ లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి తేజ నిర్మాతగానూ వ్యవహరిస్తారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కమల్ హాసన్‌తో తేజ చిత్రం ఎప్పుడో మొదలవ్వాల్సినప్పటకీ...ఆయన 'దృశ్యం' తమిళ రీమేక్ మరియు 'ఉత్తమ విలన్' చిత్రాల షూటింగులో బిజీగా ఉండటం వల్ల తేజ చిత్రం కాస్త ఆలస్యమవుతోంది.

English summary
Director Teja new movie 'Hora Hori' starts soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu